close

తాజా వార్తలు

హరియాణా పాఠశాలలో అగ్ని ప్రమాదం

ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురి మరణం

 

చండీగఢ్‌: హరియాణా రాష్ట్రంలోని ఫరిదాబాద్‌లోని ఓ పాఠశాల భవనంలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు  మరణించగా, వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫరిదాబాద్‌లోని దబువా కాలనీలోని ఏఎన్‌డీ కాన్వెంట్ పాఠశాల, దాని కింద ఉన్న దుస్తుల గోడౌన్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులలో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, అగ్ని మాపక సిబ్బంది సహాయ చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. 

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.