Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 109862
            [news_title_telugu_html] => 

హాంగ్‌కాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు

 

[news_title_telugu] => హాంగ్‌కాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు   [news_title_english] => Hong Kong protesters demonstrate against extradition bill [news_short_description] =>  నేరపూరిత చర్యలకు పాల్పడి పట్టుబడిన వారిని అవసరమైతే విచారణ నిమిత్తం చైనా ప్రధాన భూభాగానికి పంపేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న బిల్లుకి వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్‌ నగరంలో వేలాది మంది ప్రజలు నిరసనలకు దిగారు.  [news_tags_keywords] => china,Hong Kong [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/AMNS8IgLFbA [news_videoinfo] => |https://www.youtube.com/embed/AMNS8IgLFbA [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-10 02:57:39 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హాంగ్‌కాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు   - Hong Kong protesters demonstrate against extradition bill - EENADU
close

తాజా వార్తలు

హాంగ్‌కాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు  

హాంగ్‌కాంగ్‌: నేరపూరిత చర్యలకు పాల్పడి పట్టుబడిన వారిని అవసరమైతే విచారణ నిమిత్తం చైనా ప్రధాన భూభాగానికి పంపేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న బిల్లుకి వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్‌ నగరంలో వేలాది మంది ప్రజలు నిరసనలకు దిగారు. 15 ఏళ్లలో ఇంత భారీ ఎత్తున ఎన్నడూ నిరసన ప్రదర్శనలు జరగలేదు. ఆదివారం మధ్యాహ్నం మధ్య వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ‘హాంగ్‌కాంగ్‌ ఎన్నటికీ హక్కును వదులుకోదు’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. 2014లో హాంగ్‌కాంగ్‌ ప్రజాస్వామ్య నిరసనల్లో భాగంగా నిర్వహించిన ‘అంబ్రెల్లా మూమెంట్’ తర్వాత ఆ స్థాయిలో మళ్లీ ఆదివారం ఈ నిరసనలు జరిగాయి.

ఆ బిల్లును జులై మాసం ముగిసేలోపే తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బిల్లు హాంగ్‌కాంగ్‌ స్వతంత్ర న్యాయవ్యవస్థను దెబ్బతీసేలా ఉంటుందని నిరసనకారులు అంటున్నారు. వ్యాపారులు, న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజాస్వామ్య సానుకూల సంఘాలు, మత సంబంధ బృందాలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నాయి. ఈ బిల్లును తీసుకురావడం సరికాదని, ఒకవేళ ఈ చట్టం వస్తే అది హాంగ్‌కాంగ్‌ ‘ఎండ్‌ గేమ్’ అవుతుందని ఒక నిరసనకారుడు మండిపడ్డారు. ‘ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సెంటర్‌గా ఉన్న హాంగ్‌కాంగ్‌ కీర్తికే కాకుండా, న్యాయవ్యవస్థను దెబ్బ తీసే విధంగా ఈ బిల్లు ప్రభావం చూపుతుంది’ అని ఓ నిరసనకారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి.. గర్భవతి అయిన తన ప్రియురాలిని తీసుకుని గతేడాది ఫిబ్రవరీలో తైవాన్‌కు వెళ్లాడు. అక్కడ ఆమెను అతడు హత్య చేసి, అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి హాంగ్‌కాంగ్‌ వచ్చేశాడు. దీంతో అతడిని తమకు అప్పగించాలని తైవాన్‌ కోరింది. అయితే, నేరస్తుల అప్పగింతపై తైవాన్‌తో సరైన ఒప్పందాలు లేక హాంగ్‌కాంగ్ ఇందుకు నిరాకరించింది. కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యలో హాంగ్‌కాంగ్‌ ఈ బిల్లుని తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అయితే, ఇందుకు ప్రజలు ససేమీరా అంటున్నారు. హాంగ్‌కాంగ్ హక్కులకు భంగం కలుగుతుందని చెబుతున్నారు.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.