Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112388
            [news_title_telugu_html] => 

మన్మోహన్‌ సింగ్‌ దారెటు?

[news_title_telugu] => మన్మోహన్‌ సింగ్‌ దారెటు? [news_title_english] => parliament to miss manmohan as his rs term ends on friday [news_short_description] => మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. దీంతో రానున్న బడ్జెట్ సమావేశాలకు ఆయన దూరంగా ఉండనున్నారు. కాంగ్రెస్‌ హయాంలోని ప్రభుత్వాలలో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.... [news_tags_keywords] => manmohan singh,congress,rajya sabha [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-15 10:31:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మన్మోహన్‌ సింగ్‌ దారెటు? - parliament to miss manmohan as his rs term ends on friday - EENADU
close

తాజా వార్తలు

మన్మోహన్‌ సింగ్‌ దారెటు?

దిల్లీ: మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. దీంతో రానున్న బడ్జెట్ సమావేశాలకు ఆయన దూరంగా ఉండనున్నారు. కాంగ్రెస్‌ హయాంలోని ప్రభుత్వాలలో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 1991 ఆర్థిక సంస్కరణల అమలులోనూ కీలకంగా వ్యవహరించారు. 2008లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యమాన్ని ఎదుర్కొన్నా భారత్‌పై మాత్రం అది పెద్దగా ప్రభావం చూపలేదు. మన్మోహన్‌ వ్యూహాలే అందుకు కారణమని అప్పట్లో వివిధ వర్గాల నుంచి ఆయన ప్రశంసలు అందుకున్నారు. 1991 నుంచి ఆయన అసోం రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. కానీ ఈసారి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కేవలం 25 మంది ఎమ్మెల్యేలే ఉండడంతో ఆయన ఎన్నిక సాధ్యమయ్యే అవకాశాలు దాదాపు లేనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఒడిశా, తమిళనాడు, బిహార్‌, గుజరాత్‌లలో రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే గుజరాత్‌ మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు అంతగా బలం లేదు. దీంతో ఆ మూడు రాష్ట్రాల నుంచి మన్మోహన్‌ను పెద్దల సభకు పంపడం కాంగ్రెస్‌కు సాధ్యమయ్యే పని కాదు. ఇక గుజరాత్‌లో ఉన్న బలంతో కనీసం ఒక్క సీటైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ సీటును మన్మోహన్‌కు కేటాయించే అవకాశం లేవని పలువురు నాయకులు అభిప్రాయడుతున్నారు.

కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన బలం ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి ఆయా రాష్ట్రాల నుంచి రాజ్యసభ సీట్లు ఖాళీగా లేవు. ఈ నేపథ్యంలో పై రాష్ట్రాల నుంచి ఎవరో ఒకరిని రాజీనామా చేయించి ఆ స్థానంలో మన్మోహన్‌ను పెద్ద సభలో కూర్చొబెట్టడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే దీనిపై పార్టీలో ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని కొంతమంది నాయకులు తెలిపారు. 28ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యునిగా ఉన్న మన్మోహన్‌ 2004-2014 మధ్య ప్రధాని బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సుదీర్ఘ రాజకీయ అనుభవానికి తోడు దేశ ఆర్థిక అంశాలపై సమగ్ర అవగాహన ఉన్న మన్మోహన్‌ మరోసారి పార్లమెంటుకు వెళతారా లేక పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితమవుతారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.