close

తాజా వార్తలు

ఎంపీగా ప్రమాణం చేసిన మోదీ

దిల్లీ: పదిహేడో లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం చేపట్టారు. తొలుత ప్రధానమంత్రి, ఎన్డీయే పక్షనేత నరేంద్రమోదీ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ మోదీచే ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ నుంచి సురేశ్‌ కొడికున్నిల్‌, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా తదితరులు ప్రమాణస్వీకారం చేశారు. 

ముందు కేంద్రమంత్రులు, ప్యానెల్‌ ఛైర్మన్లు ముందు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఎంపీల ప్రమాణాలు జరుగుతాయి. ఇవాళ, రేపు ఎంపీల ప్రమాణస్వీకారాలు జరుగుతాయి. బుధవారం స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. నేటి నుంచి జులై 26 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. జులై 5న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో త్రిపుల్‌ తలాక్‌ సహా 10 ఆర్డినెన్స్‌లకు చట్టం రూపం తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. 

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.