close

తాజా వార్తలు

ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలు

శ్రీనగర్‌: జమ్ము-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ ప్రాంతంలో జవాన్లు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో ముగ్గురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాద కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ విషయాన్ని పసిగట్టిన ఉగ్రమూకలు  దళాలపై కాల్పులు జరిపాయి. జవాన్లు అప్రమత్తంగా ఉండటంతో వాటిని తిప్పికొట్టారు. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అక్కడ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.