Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113349
            [news_title_telugu_html] => 

ఆందోళన ఆపి.. అంబులెన్స్‌కు దారి

[news_title_telugu] => ఆందోళన ఆపి.. అంబులెన్స్‌కు దారి [news_title_english] => Hong Kong protestors calmly parting to allow an ambulance [news_short_description] => దేశం అట్టుడుకిపోయే లక్షల మంది వీధుల్లోకి చేరి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి నినాదాలు చేస్తున్నారు. ఇంతలో ఓ అంబులెన్స్‌ సైరన్‌ వారికి వినిపించింది. ఆందోళన చేస్తున్నవారల్లా ఒక్క క్షణం [news_tags_keywords] => Hong Kong,protestors,ambulance [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 3 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-17 16:23:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆందోళన ఆపి.. అంబులెన్స్‌కు దారి - Hong Kong protestors calmly parting to allow an ambulance - EENADU
close

తాజా వార్తలు

ఆందోళన ఆపి.. అంబులెన్స్‌కు దారి

హాంకాంగ్‌: దేశం అట్టుడుకిపోయేలా లక్షల మంది వీధుల్లోకి చేరి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి నినాదాలు చేస్తున్నారు. ఇంతలో ఓ అంబులెన్స్‌ సైరన్‌ వారికి వినిపించింది. ఆందోళన చేస్తున్నవారల్లా ఒక్క క్షణం నినాదాలు ఆపి పక్కకు జరిగారు. అంబులెన్స్‌కు దారిచ్చి వాహనం వెళ్లేవరకు మౌనంగా ఉండిపోయారు. హాంకాంగ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం యావత్‌ ప్రపంచం మనసులను గెలిచింది. 

చైనాకు నేరస్థులను అప్పగించే బిల్లును వ్యతిరేకిస్తూ వరుసగా రెండో ఆదివారం హాంకాంగ్‌ ప్రజలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా లక్షల మంది ప్రజలు వీధుల్లోకి చేరి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఓ నిరసనకారుడు అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ అక్కడకు చేరుకుంది. నిరసనకారులతో కిక్కిరిసిపోయిన వీధిలోకి అంబులెన్స్‌ రాగానే వారంతా నినాదాలు చేయడం ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు. వాహనం వెళ్లగానే మళ్లీ తమ ఆందోళన సాగించారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడమేగాక.. ఎందరో మనసులను గెలుచుకుంది. హాంకాంగ్ ప్రజలు ప్రపంచంలోనే ఎంతో క్రమశిక్షణ కలిగిన నిరసనకారులని నెటిజన్లు వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్‌లో అంబులెన్స్‌ చిక్కుకుంటేనే దారివ్వకుండా తమ దారిన వెళ్లిపోయే ఈ రోజుల్లో హాంకాంగ్‌ ఆందోళనకారులు చేసిన పని పలువురికి ఆదర్శంగా నిలిచింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.