close

తాజా వార్తలు

న్యాయవ్యవస్థ స్వతంత్రతను రక్షించాలి:గొగొయి

దిల్లీ: క్రియాశీలక న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఆత్మ లాంటిదని దాన్ని నిరంతరం పరిరక్షించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి అభిప్రాయపడ్డారు. అలాగే న్యాయవ్యవస్థలో నాయకత్వ లక్షణాల ఆవశ్యకతను వివరించారు. రష్యాలో జరుగుతున్న ‘షాంఘై సహకార సంఘం’(ఎస్‌సీఓ) సభ్యదేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసంలో భాగంగా ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలన్నది ప్రతిదేశంలోని ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. దేశాలని అస్థిరపరచడానికి జరుగుతున్న దాడుల నేపథ్యంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనైనా రాజ్యాంగ విలువల్ని పరిరక్షించడమే లక్ష్యంగా న్యాయవ్యవస్థలు పని చేయాలన్నారు. 

భారత్‌లో కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండేవని ఈ సందర్భంగా గొగొయి తెలిపారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత, న్యాయమూర్తుల స్వతంత్రత రెండు వేరువేరు అంశాలని.. అయితే బలమైన, క్రియాశీల న్యాయవ్యవస్థ కోసం రెండు పరస్పరం ఆధారపడాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఐరాస మూల సూత్రాలను ఉటంకిస్తూ.. న్యాయవ్యవస్థలో మెరుగైన మౌలికవసతులు ఉన్నట్లయితే ఆయా ప్రభుత్వాలు, పాలకవర్గాలు సుస్థిరంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గొగొయితో పాటు, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా పాల్గొన్నారు. ఎస్‌సీఓ సమావేశంలో భాగంగా గొగొయి సోమవారం రష్యా ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయ్యారు. కేసుల వేగవంత పరిష్కారం కోసం ఎస్‌సీఓ సభ్యదేశాల విధానాలను అందిపుచ్చుకోవడానికి భారత్‌ సిద్ధంగా ఉందని తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.