Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114631
            [news_title_telugu_html] => 

కొరియాలో అడుగుపెట్టిన జిన్‌పింగ్‌

[news_title_telugu] => కొరియాలో అడుగుపెట్టిన జిన్‌పింగ్‌ [news_title_english] => Xi Jinping arrives in Pyongyang marking first visit by Chinese leader to North Korea in 14 years [news_short_description] => చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఉత్తర కొరియాకు చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌తో సమావేశం కోసం ఆయన అక్కడకు వెళ్లాడు. రెండు రోజుల పాటు జిన్‌పింగ్‌ ఉత్తర కొరియాలో పర్యటిస్తారు. [news_tags_keywords] => Xi Jinping,Kim Jong Un,North Korea [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-20 10:53:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కొరియాలో అడుగుపెట్టిన జిన్‌పింగ్‌ - Xi Jinping arrives in Pyongyang marking first visit by Chinese leader to North Korea in 14 years - EENADU
close

తాజా వార్తలు

కొరియాలో అడుగుపెట్టిన జిన్‌పింగ్‌

14 సంవత్సరాల తర్వాత ఉత్తర కొరియాలో పర్యటన

ప్యాంగ్యాంగ్‌: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ దంపతులు ఉత్తర కొరియాకు చేరుకున్నారు. ఆ దేశ సుప్రీంలీడర్‌ కిమ్ జోంగ్‌ ఉన్‌తో సమావేశం కోసం అక్కడకు వెళ్లాడు. రెండు రోజుల పాటు జిన్‌పింగ్‌ ఉత్తర కొరియాలో పర్యటిస్తారు. ఇందుకోసం బుధవారం ఉదయాన్నే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ప్రధాన ఆర్థిక సలహాదారు హీ లైఫెంగ్‌తో సహా ప్రధాన సహాయకులు ప్రత్యేక విమానంలో ప్యాంగ్యాంగ్‌ చేరుకున్నారు. ఉత్తర కొరియా దేశ రోడాంగ్‌ సిన్మున్‌ అనే పత్రిక తెలిపిన వివరాల ప్రకారం ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహసంబంధంలో మరో నూతన అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఈ సమావేశం తోడ్పడనుంది. ఉత్తర కొరియాలో మీడియాకు ఎన్నో ఆంక్షలు ఉంటాయి. విదేశీ నేతల పర్యటనల గురించి అక్కడి మీడియా రాయడం అరుదు. కానీ, జిన్‌పింగ్‌ పర్యటన గురించి రాయడం విశేషమనే చెప్పాలి.  ఉత్తర కొరియాలో పర్యటించాల్సిందిగా గతేడాదే కిమ్‌ నుంచి జిన్‌పింగ్‌కు ఆహ్వానం అందింది. 

కిమ్‌, జిన్‌పింగ్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీరిద్దరి భేటీ సందర్భంగా అణు శక్తికి సంబంధించే చర్చించుకునే అవకాశాలున్నాయి. 2008లో జిన్‌పింగ్‌ ప్యాంగ్యాంగ్‌కు వచ్చారు. అప్పుడాయన చైనాకు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కిమ్‌ జోంగ్‌ ఉన్ తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌  ఆ సమయంలో ఉత్తర కొరియాను పరిపాలించారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.