close

తాజా వార్తలు

కజకిస్థాన్‌ ఆర్మీ ఆయుధ డిపోలో భారీపేలుళ్లు..

40 వేల మంది ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు  

నూర్‌ సుల్తాన్‌ (కజకిస్థాన్‌): ఉత్తర కజాఖ్‌లోని ఆర్మీ ఆయుధాల డిపోలో సోమవారం పెద్ద ఎత్తున పేలుళ్లు చోటు చేసుకున్నాయి. కజకిస్థాన్‌లోని అరీస్‌ నగరానికి సమీపంలో ఈ డిపో ఉంటుంది. ఉన్నట్టుండి మంటలు అంటుకున్న కారణంగా పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయని, ఆ నగరంలోని 40,000 మంది ప్రజలను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించామని అధికారులు తెలిపారు. ‘‘మంటల కారణంగా డిపోలోని కొన్ని ఆయుధాలు పేలిపోయాయి’’ అని కజకిస్థాన్‌ రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది. పేలుళ్ల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. ఇవి మరింత వ్యాపిస్తుండడంతో స్థానికులు తమ ప్రాంతాల నుంచి భయంతో పరుగులు తీస్తూ కనబడ్డారు. 

ఈ ఘటనలో ఎవరూ మృతి చెందలేదని, 50 మంది ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారని అధికారులు చెప్పారు. వారికి రెండు ఆస్పత్రుల్లో చికిత్స అందుతున్నట్లు తెలిపారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. ‘‘సోమవారమే ఈ నగరాన్ని పూర్తిగా ఖాళీ చేయిస్తాం’’ అని ఓ అధికారి ప్రకటించారు. మంటలు ఎలా అంటుకున్నాయి? ఆయుధాల డిపో వాటి ద్వారా ఎలా ధ్వంసమైంది? అన్న విషయాలపై స్పష్టత రాలేదు. నగరాన్ని పూర్తిగా ఖాళీ చేయించిన తర్వాత ఆ విషయాన్ని గుర్తిస్తామని ఓ అధికారి తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.