Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119769
            [news_title_telugu_html] => 

హాంకాంగ్‌లో మరోసారి భారీ నిరసన ప్రదర్శన

[news_title_telugu] => హాంకాంగ్‌లో మరోసారి భారీ నిరసన ప్రదర్శన [news_title_english] => Hong Kong descends into chaos as protesters storm legislature [news_short_description] => నేరస్థులను చైనాకు అప్పగించే చట్టాన్ని తీసుకురావాలని తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇటీవల హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చెలరేగిన విషయం తెలిసిందే.   [news_tags_keywords] => Hong Kong,protesters,china [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-01 19:07:05 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హాంకాంగ్‌లో మరోసారి భారీ నిరసన ప్రదర్శన - Hong Kong descends into chaos as protesters storm legislature - EENADU
close

తాజా వార్తలు

హాంకాంగ్‌లో మరోసారి భారీ నిరసన ప్రదర్శన

హాంకాంగ్‌: నేరస్థులను చైనాకు అప్పగించే చట్టాన్ని తీసుకురావాలని తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇటీవల హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో తలొగ్గిన ప్రభుత్వం ఆ బిల్లును సస్పెండ్ చేసింది. అయితే, అధికారికంగా మాత్రం దాన్ని వెనక్కి తీసుకోలేదు. బ్రిటీష్‌ పరిపాలన నుంచి హాంకాంగ్‌ బయటపడిన జులై 1, 1997 రోజును గుర్తు చేసుకుంటూ సోమవారం మరోసారి వేలాది మంది ప్రజలు భారీ ప్రదర్శనలు నిర్వహించి, విధ్వంసానికి పాల్పడ్డారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో రోడ్లన్నీ జనసముద్రాన్ని తలపించాయి.

 

 లెజిస్లేటివ్‌ కౌన్సిల్ కార్యాలయ ప్రాంగణంలోని ఓ ప్రభుత్వ కార్యాలయ అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లును వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ప్రభుత్వ కార్యాలయ అద్దాలను ధ్వంసం చేసే సమయంలో తమను గుర్తు పట్టకుండా ముఖానికి మాస్కులు ధరించారు. హాంకాంగ్ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టిన సమయంలో తమ తలలకు పసుపు రంగు హెల్మెట్లను ధరించారు. వారిని భద్రతా బలగాలు అడ్డుకోలేకపోయాయి. హాంకాంగ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ వద్ద ఉన్న నిరసనకారులు వెళ్లిపోవాలని ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ కూడా జారీ చేసింది. అయినప్పటికీ వారు వెళ్లలేదు. ఆందోళనకారుల తీరును ‘‘తీవ్ర హింసాత్మక చర్య’’గా ప్రభుత్వం ఆరోపించింది.  


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.