close

తాజా వార్తలు

ఐదేళ్లలో 1.25 లక్షల కిలోమీటర్ల రోడ్లు

దిల్లీ: రెండోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియయన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకోవాలని నిర్ణయించింది. తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు. గత ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల ఫలితంగా  అదనంగా ఒక ట్రిలియన్‌ డాలర్లను జోడించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 3 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థను అందుకుంటామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లను చేరుకుంటామని తెలిపారు. అందుకోసం మౌలికవసతులు, డిజిటల్‌ ఎకానమీ, ఉద్యోగ కల్పనపై భారీగా పెట్టుబడి పెట్టా్ల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రజా రవాణాకు ఒకే కార్డు.. 
ఆర్థిక వ్యవస్థ పరుగులు తీయాలంటే రవాణా మార్గాల అనుసంధానం అవసరమని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన, ఇండస్ట్రియల్‌ కారిడార్‌, వస్తు రవాణా కారిడార్‌, భారత్‌ మాల, సాగర్‌ మాల, జల్‌మార్గ్‌ వికాస్‌, ఉడాన్‌ వంటి పథకాలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి, రవాణా వ్యయాన్ని తగ్గించి దేశీయంగా వస్తు రవాణా విషయంలో పోటీతత్వం పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు.

* విమానయాన రంగంలో ఉడాన్‌ పథకం కింద చిన్న చిన్న నగరాలకు కూడా విమాన సదుపాయాన్ని కల్పించామన్నారు. సామాన్యుడికి సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం విమానయాన రంగంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్నామని తెలిపారు. ఈ రంగం ఆర్థిక స్వావలంభన సాధించేందుకు, ఉపాధి కల్పన మెరుగుపరిచేందుకు ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఫైనాన్సింగ్‌, లీజింగ్‌ రంగంలోకి భారత్‌ అడుగుపెడుతున్నట్లు చెప్పారు.

* 2018-19 సంవత్సరంలో 300 కిలోమీటర్ల మెట్రో మార్గానికి ఆమోదం లభించిందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా 657 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.

* మెట్రో, టోల్‌ ట్యాక్స్‌, బస్‌ ఛార్జీలు, పార్కింగ్‌ రుసుములు, రిటైల్‌ షాపింగ్‌, నగదు ఉపసంహరణ ఇలా అన్నింటికీ ప్రజారవాణాతో పాటు, ఇతర అవసరాలు తీర్చేలా రూపే కార్డు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
* రైల్వేలో మౌలిక వసతుల కల్పన కోసం 2018-30 మధ్య మొత్తం రూ.50 లక్షల కోట్లు పెట్టుబడులు అవసరమన్నారు. రైల్వేలో ప్రాజెక్టులు దశాబ్దాలుగా ముందుకు సాగని నేపథ్యంంలో పీపీపీ విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు.
* ఇప్పటికే భారత్‌మాల ఫేజ్‌-1ను పూర్తి చేసుకున్నామన్నారు. నేషనల్‌ హైవే గ్రిడ్‌ ఏర్పాటే లక్ష్యంగా ఫేజ్‌-2 ప్రారంంభిస్తామని, ఆయా రాష్ట్రాలు రాష్ట్రీయ రహదారుల నిర్మాణంలో భాగస్వాములు కానున్నాయని వివరించారు.
* ప్రయాణ, రవాణా ఖర్చులు తగ్గించుకునేందుకు జల్‌మార్గ్‌ వికాస్‌ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. 
* ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద గత వెయ్యి రోజుల్లో రోజుకు 130 నుంచి 135 కిలోమీటర్ల రహదారులు నిర్మించామన్నారు. రహదారుల నిర్మాణ విషయంలో 2022 నాటి లక్ష్యాన్ని 2019 నాటికే చేరుకున్నామన్నారు. పీఎంజీఎస్‌వై-3 కింద 1.25 లక్షల కిలోమీటర్ల రోడ్లను రాబోయే ఐదేళ్లలో నిర్మించనున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.80,250 కోట్లు వెచ్చించనున్నామని తెలిపారు.
* వీటితో పాటు వాటర్‌ గ్రిడ్‌, గ్యాస్‌ గ్రిడ్‌, ఐ-వేస్‌, రీజనల్‌ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని సీతారామన్‌ వివరించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.