
తాజా వార్తలు
బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
దిల్లీ: దేశవ్యాప్తంగా ఉద్యోగ కల్పనలో ఎలాంటి ప్రగతి లేదంటూ ఒకవైపు ప్రతిపక్షాలు విరుచుకుపడుతుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గత రెండేళ్లలో దాదాపు 3.81 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సంఖ్య 2017 మార్చి 1 నాటికి 32,38,397గా ఉండగా.. ఇదే సంఖ్య 2019 మార్చి 1 నాటికి 3,81,199 కొత్త ఉద్యోగాలతో 36,19,596కి చేరినట్లు సీతారామన్ పేర్కొన్నారు. అయితే గత అయిదేళ్ల భాజపా పాలనలో దేశంలో నిరుద్యోగం మరింతగా పెరిగిపోయిందని అప్పటికే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు భాజపాపై విరుచుపడుతూనే ఉన్నాయి. ఈ మేరకు 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని వివిధ శాఖల్లో భర్తీ చేసిన కొత్త ఉద్యోగాల వివరాలను బడ్జెట్ ప్రసంగంలో భాగంగా సీతారామన్ వెల్లడించారు.
శాఖల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి..
రైల్వే శాఖ | 98,999 |
పోలీసు విభాగాలు | 80,000 |
పరోక్ష పన్నుల విభాగం | 53 వేలకుపైగా |
ప్రత్యక్ష పన్నుల విభాగం | 29,935 |
రక్షణ శాఖ (సివిల్) | 46,347 |
అణుశక్తి విభాగం | 10,000 |
టెలీకమ్యూనికేషన్ విభాగం | 2,250 |
నీటి పారుదల శాఖ, గంగా ప్రక్షాళన విభాగాలు | 3,981 |
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలు | 7,743 |
గనుల శాఖ | 6,338 |
డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ | 2,920 |
పింఛన్లు, పబ్లిక్ గ్రీవియెన్సెస్ | 2,056 |
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ | 1,833 |
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ | 3,647 |
వ్యవసాయ శాఖ | 1,835 |
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ | 1,189 |
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
