close

తాజా వార్తలు

శ్రీలంకకు యుద్ధనౌకను బహూకరించిన చైనా

బీజింగ్‌:  హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలకమైన శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చైనా దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. తాజాగా లంకకు ఓ యుద్ధ నౌకను చైనా బహుమతిగా అందజేసింది. ‘పీ625’గా పిలుస్తున్న సదరు యుద్ధనౌక గతవారమే కొలంబో చేరుకుంది. తీరప్రాంత గస్తీకి, సముద్ర దొంగలపై పోరాటానికి దాన్ని వినియోగించే అవకాశముంది. ‘పీ625’ని అందజేసినందుకుగాను చైనాకు శ్రీలంక నౌకాదళం కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు, లంకకు త్వరలో 9 కొత్తరకం డీచ్కీజిజిల్‌ రైళ్లను అందించనున్నట్లు చైనా ప్రకటించింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.