close

తాజా వార్తలు

సాల్వేజీ.. మీ వాదన భేష్‌: సుష్మా

దిల్లీ: పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో జాదవ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో సమర్ధంగా వాదనలు వినిపించారని కేంద్ర విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రశంసించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో పోస్టు చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు ఈ కేసును తీసుకువెళ్లిన ప్రధాని నరేంద్రమోదీకి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరణశిక్షను నిలుపుదల చేయడం భారత విజయమన్నారు. ఈ చర్య జాదవ్‌ కుటుంబీకులకు సాంత్వన కలిగిస్తుందన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.