close

తాజా వార్తలు

అమెరికా.. ఇరాన్‌.. డ్రోన్‌ యుద్ధం

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్‌ మధ్య పరిస్థితులు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. మొన్నామధ్య గల్ఫ్‌ జలాల్లో చమురు ట్యాంకర్లపై దాడి.. ఆ తర్వాత అమెరికాకు చెందిన డ్రోన్‌ను ఇరాన్‌ను కూల్చేయడం వంటివి ఉద్రిక్తతకు దారి తీశాయి. అయితే తాజాగా మరోసారి అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఇరాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను అమెరికా మిలిటరీ కూల్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

అమెరికా నేవీకి చెందిన ‘యూఎస్‌ఎస్‌ బాక్సర్‌’ నౌక హొర్ముజ్‌ స్ట్రెయిట్‌ సమీపంలోని అంతర్జాతీయ జలాల మీదుగా వెళ్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ నౌకకు అతి సమీపంగా వచ్చినట్లు ట్రంప్‌ తెలిపారు. నౌకకు దాదాపు 1000 గజాల దూరంలో డ్రోన్‌ తిరగాడిందని, ఎన్నిసార్లు హెచ్చరించినా అక్కడి నుంచి వెనక్కి వెళ్లకపోవడంతో తమ మిలిటరీ అధికారులు దాన్ని కూల్చేసినట్లు చెప్పారు. నౌక, అందులోని సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకునే కూల్చినట్లు వెల్లడించారు. 
అయితే ఈ వార్తలను ఇరాన్‌ తోసిపుచ్చింది. ‘డ్రోన్‌ను కోల్పోయినట్లు ఈ రోజు మాకు ఎలాంటి సమాచారం రాలేదు’ అని ఆ దేశ విదేశాంగమంత్రి మహ్మద్‌ జావెద్‌ జరీఫ్‌ తెలిపారు. 

ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అంతేగాక.. ఆ దేశ ఉత్పత్తులను ఇతర దేశాలు కొనుగోలు చేయకుండా ఆంక్షలు కూడా విధించారు. అప్పటి నుంచి ఇరాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గత నెలలో గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ సమీపంలో రెండు చమురు నౌకలపై దాడి జరిగింది. ఈ దాడి ఇరాన్‌  చేసిందని అగ్రరాజ్యం ఆరోపించింది. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని పేర్కొంది. అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్‌ తిప్పికొట్టింది. 

ఇది జరిగిన కొద్ది రోజులకే గత నెల 19న అమెరికాకు చెందిన ఓ నిఘా డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చేసిన విషయం తెలిసిందే. నిబంధనలను ఉల్లంఘించి తమ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిందని, అందుకే కూల్చేసినట్లు ఇరాన్‌ తెలిపింది. అటు అమెరికా కూడా ఈ వార్తలను ధ్రువీకరించింది. అయితే తాము అంతర్జాతీయ ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలిపింది. ఆ ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇరాన్‌ గగనతలం మీదుగా అమెరికా తమ విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఇక తాజా ఘటనతో ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.