close

తాజా వార్తలు

అమెరికాకు ఇమ్రాన్‌ ఎందుకు వెళుతున్నారు?

దిల్లీ : దాయాది దేశం పాక్‌ రోజు రోజుకు దొంగ తెలివిని ప్రదర్శించడం ఎక్కువవుతోంది. ఉగ్రవాద దేశంగా ముద్రపడి, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టులాడుతున్న ఆ దేశం అంతర్జాతీయ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు తన చిరకాల మిత్రదేశం చైనాతో సన్నిహిత సంబంధాలతో నష్టాల నుంచి బయటపడాలని కుయుక్తులు పన్నడం విశేషం.

రెండూ అవసరమే..
పాక్‌ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవాలంటే ప్రపంచ ఆర్థిక సంస్థల చేయూత అవసరం. అయితే పాక్‌ ఉగ్రవాద అనుకూలధోరణి కారణంగా అమెరికా గుర్రుగా ఉంది. అంతర్జాతీయంగా అమెరికాకు సవాల్‌గా మారిన చైనాకు పాక్‌ ఆప్తమిత్రదేశం కావడంతో పాక్‌కు పగ్గాలు వేయాలని అమెరికా ఎప్పటి నుంచో యోచిస్తోంది. పాక్‌ను చైనాను అనుసంధానించే ఆర్థికనడవాకు చైనా భారీ ఎత్తున ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. రానున్న కొద్ది రోజుల్లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో సైనికాధిపతి జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా కూడా వెళ్లనున్నారు. పాక్‌కు అమెరికా నుంచి ఆయుధ సహకారం కీలకం. దీంతో అమెరికా పర్యటనలో బజ్వా కూడా వెళ్లనుండటంతో కీలకప్రాధాన్యతను సంతరించుకుంది.

అమెరికా అవసరాలకు అనుగుణంగా..
అఫ్గనిస్థాన్‌, ఇరాన్‌లతో భౌగోళిక సరిహద్దులు ఉండటంతో పాక్‌ను అమెరికా సులువుగా వదులుకోలేదు. ఈ విషయం పాక్‌కు తెలుసు. అందుకే అమెరికాతో సంబంధాలు తెగే వరకు లాగకుండా వ్యవహరిస్తోంది. ఇరాన్‌తో అమెరికా వైరం ముదురుతోంది. అదే విధంగా అఫ్గన్‌లోనూ అమెరికా తన జోక్యాన్ని వదులుకోదు. దీంతో అమెరికాకు అనుకూలంగా పాక్‌ తన భూభాగాన్ని వినియోగించేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇవ్వనుంది. అదే విధంగా చైనా బూచిని చూపి వీలయినంత ఆర్థిక, మిలట్రీ సాయాన్ని పొందేందుకు పాక్‌ యత్నించనుంది. వాస్తవానికి అఫ్గన్‌ నుంచి తమ సైనికదళాలను ఉపసంహరించుకోవాలని ట్రంప్‌ నిశ్చయంతో ఉన్నారు. అయితే ఆ దేశంపై తమ ఆధిపత్యం కొనసాగాలని మాత్రం ఆశిస్తున్నారు.తాలిబాన్లతో చర్చలు ఏర్పాటుచేయడంతో పాక్‌ కీలకభూమిక పోషించింది.  ఉగ్రవాదం పేరుతో భారీగా నిధులు అందుకున్న పాక్‌ తమను వంచనకు గురిచేసిందంటూ గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.

డబుల్‌గేమ్‌ ఆడుతున్న పాక్‌
అమెరికా, చైనాల పట్ల పాక్‌ ఆచితూచీ వ్యవహరిస్తోంది.రెండు దేశాలు కీలకం కావడంతో వారి ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. మధ్యప్రాచ్యంతో పాటు ఇంధన వనరుల సరఫరాకు పాక్‌ కీలకమని చైనాకు తెలుసు. అందుకే ఆర్థికనడవా, గ్వదర్‌ పోర్టు నిర్మాణం ద్వారా బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తోంది. కానీ ఈ సాయం పాక్‌కు సరిపోదు. అంతర్జాతీయంగా సాయం కోసం అమెరికా వైపు చూడాల్సిందే. చైనాను అమెరికా ఒత్తిడి మేరకు దూరం చేసుకొనే యోచనలేదు. పైకి మాత్రం చైనాకు అంత సన్నిహితం కాదని పాక్‌ నటిస్తూ అమెరికా సాయం కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేసిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.