close

తాజా వార్తలు

వారిని రిటైరవ్వమని చెప్పేవాళ్లు లేరు

పాక్‌ సీనియర్‌ క్రికెటర్లను ఉద్దేశించి మాజీ కెప్టెన్‌

లాహోర్‌: ప్రపంచకప్‌లో తమస్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే కారణంతో పాకిస్థాన్‌ సీనియర్‌ ఆటగాళ్లు పశ్చాత్తాపం చెందుతున్నారని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ వకార్‌ యూనిస్‌ పేర్కొన్నాడు. తాజాగా ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వకార్‌ మరిన్ని విషయాలు వెల్లడించాడు. ‘ పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ జట్టు ఎంపిక ఆఖరి నిమిషం వరకూ తేలలేదు. ఎవరు ఆడతారో ఎవరు ఆడరో అనే విషయాలపై స్పష్టతలేదు. సీనియర్‌ ఆటగాళ్లు ఇంకా తమ కెరీర్‌ను కొనసాగించాలనుకోవడం పెద్ద సమస్యగా మారింది. గౌరవప్రదంగా రిటైరవ్వాలని ఆ క్రికెటర్లకు చెప్పేవాళ్లు లేరు. ప్రపంచకప్‌లో విఫలమవుతామనే భయంతో పీసీబీ అధికారులు ఆఖరి నిమిషంలో సీనియర్‌ ఆటగాళ్లని ఎంపిక చేశారు. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది’ అని చెప్పుకొచ్చారు.

‘అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో గెలవడానికి పాక్‌ జట్టు ఎంత కష్టపడిందో మనకు తెలుసు. భవిష్యత్‌లో అలా జరగకూడదు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, సీనియారిటి విషయాల్లో పీసీబీ రాజీపడటం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతీ ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్‌, కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్ల మార్పులు చేయడమే సరిపోతుంది. వాటివల్ల ఎలాంటి ఫలితం ఉండట్లేదు. సరైన సమయంలో సీనియర్లు రిటైరవ్వాలని నేను ఇదివరకే చెప్పాను. అయినా నా మాట ఎవరూ వినలేదు’ అని పేర్కొన్నాడు.

కాగా తనకు ప్రధాన కోచ్‌ బాధ్యతలు అప్పగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని, ఒకవేళ నిజంగా పీసీబీ అధికారులు అలాంటి అవకాశమొస్తే తప్పకుండా జట్టు కోసం తన సేవలందిస్తానని వకార్‌ చెప్పాడు. అలాగే ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యంపై ఆటగాళ్లను దూషించడాన్ని తప్పుబట్టాడు.వ్యక్తిగతంగా దూషణలు చేయొద్దని.. విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని మాజీ కెప్టెన్‌ వివరించాడు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.