close

తాజా వార్తలు

11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లోని 11 వేర్వేరు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం సోదాలు చేపట్టింది. చిట్‌ఫండ్‌ కేసు దర్యాప్తులో భాగంగా పశ్చిమబంగ, బిహార్‌, త్రిపుర, దిల్లీల్లో సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ప్రజలకు రూ.87 కోట్లు ఎగవేసిన చక్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు చెందిన పార్థ చక్రవర్తి ఇతరులపై ఉన్న కేసు దర్యాప్తులో భాగంగానే ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని నమ్మించి ప్రజల నుంచి డబ్బు తీసుకుని తిరిగి చెల్లించలేదని నిందితులపై ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.