close

తాజా వార్తలు

‘ప్రధాని మోదీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు’

న్యూదిల్లీ: కశ్మీర్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. భారత ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) ఖండించింది. ప్రధాని మోదీని రెండు వారాల క్రితం కలిసినప్పుడు కశ్మీర్‌ అంశంలో తనను మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కోరాడని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌.. ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాని మోదీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. సోమవారం పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో ట్రంప్‌ వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ..ప్రధాని నరేంద్రమోదీ నుంచి కశ్మీర్‌ విషయంలో ఒక విన్నపం వచ్చిందని ఆయన చెప్పారు. ఒకవేళ నేను ఈ విషయంలో సహాయం చేయాల్సి వస్తే.. ఒక మధ్యవర్తిగా ఉండేందుకు సంతోషిస్తాను అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.
  


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.