close

తాజా వార్తలు

బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌!

ఆయన ఎన్నిక లాంఛనమే

లండన్‌: బుధవారం థెరిసా మే బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయనుండటంతో..ఆమె వారసుడిగా బోరిస్‌ జాన్సన్‌ ఎన్నిక దాదాపు ఖరారైంది. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి రేసులో మంగళవారం ఆయన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి జెరెమీ హంట్‌ను ఓడించడంతో ఈ మాజీ లండన్ మేయర్‌ బుధవారం ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకోవడం ఇక లాంఛనమే. 
ఈ సందర్భంగా ఆయన లండన్‌లోని క్వీన్ ఎలిజబెత్ II సెంటర్‌లో మాట్లాడుతూ..‘బ్రెగ్జిట్‌ను అమలు చేస్తాను, దేశాన్ని ఐక్యంగా ఉంచుతాను, జెరెమీ కొర్బిన్‌ను ఓడిస్తాను’ అని హామీ ఇచ్చారు. అలాగే తాము ఈ దేశానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రధాని థెరిసాకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఆమె కేబినెట్లో పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. బోరిస్‌కు పూర్తి సహకారం అందిస్తానని మే ఈ సందర్భంగా వెల్లడించారు. 

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.