close

తాజా వార్తలు

ఆమె ఎందుకు తోసిందో తెలీదు

బ్రెసిలియా: వేదిక మీద మత బోధన చేస్తోన్న ఓ గురువును వెనక నుంచి ఓ మహిళ అమాంతం కిందికి తోసివేసింది. దాంతో ఆయన వేదిక మీద నుంచి ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆ ఘటన చూసి మిగతా గురువులు, 50 వేల మందికి పైగా ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. బ్రెజిల్‌లో జులైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  దానికి లక్షల సంఖ్యలో వీక్షణలు వస్తున్నాయి. ఆ వీడియోను పోస్ట్ చేసిన ఓ నెటిజన్‌..‘లావుగా ఉన్న మహిళలు స్వర్గానికి వెళ్లరని ఆ గురువు చెప్పారు’ అని పేర్కొన్నారు. అందుకే ఆమె ఆ చర్యకు పూనుకున్నట్లు వెల్లడించారు. అయితే  ఆ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలుస్తోంది.  

ఈ గురువు ఉపన్యాసాన్ని బ్రెజిల్‌కు చెందిన రచయిత తర్జుమా చేశారు. ‘ఈ చేతులు నాకు చెందినవి కావు. దేవుడువి మాత్రమే. ఎందుకంటే ఈ గురువు  దేవుడి ఆధీనంలోనే పనిచేస్తున్నాడు. సేవ చేయడానికి, ఆశీర్వదించడానికి..’ అని ప్రసంగ సారాంశాన్ని వివరించారు. అయితే ఆ మహిళ గురువును వేదిక మీద నుంచి ఎందుకు తోసివేసిందో తెలియరాలేదు. మానసిక ఆరోగ్యం సరిగా లేదని ఆమె సన్నిహితులు తెలిపారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనతో పోలీసులు ఆమెను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆ గురువు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో ఆమెను వెంటనే వదిలేశారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.