Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 132339
            [news_title_telugu_html] => 

క్షమాపణలు చెప్పాలి.. లేదంటే చర్యలే

[news_title_telugu] => క్షమాపణలు చెప్పాలి.. లేదంటే చర్యలే [news_title_english] => Lok Sabha Speaker Om Birla will ask SP MP Azam Khan to apologise [news_short_description] => భాజపా మహిళా ఎంపీపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజమ్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ వ్యవహారంలో నేడు లోక్‌సభ దద్దరిల్లింది. ఆజమ్‌ఖాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ మహిళా [news_tags_keywords] => Azam Khan,SP,Speaker,Om Birla,Loksabha [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-26 17:42:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
క్షమాపణలు చెప్పాలి.. లేదంటే చర్యలే - Lok Sabha Speaker Om Birla will ask SP MP Azam Khan to apologise - EENADU
close

తాజా వార్తలు

క్షమాపణలు చెప్పాలి.. లేదంటే చర్యలే

ఆజమ్‌ఖాన్‌ను ఆదేశించిన స్పీకర్‌!

దిల్లీ: భాజపా మహిళా ఎంపీపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజమ్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ వ్యవహారంలో శుక్రవారం లోక్‌సభ దద్దరిల్లింది. ఆజమ్‌ఖాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ మహిళా ఎంపీలు సహా భాజపా సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశమైన స్పీకర్‌ ఓం బిర్లా.. ఆజమ్‌ఖాన్‌ క్షమాపణ చెప్పాల్సిందేనని నిర్ణయించినట్లు సమాచారం.

లోక్‌సభ సమావేశం అనంతరం భాజపా నేతలు, విపక్ష నేతలు అధిర్‌ రంజన్‌ చౌధరీ, గల్లా జయదేవ్‌, దనీశ్‌ అలీ, సుప్రియా సూలే, ఇతర సమాజ్‌వాదీ పార్టీ నేతలతో స్పీకర్‌ ఓం బిర్లా సమావేశమయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలకు గానూ ఆజమ్‌ఖాన్‌ క్షమాపణలు చెప్పాలని స్పీకర్‌, అఖిలపక్ష నేతలు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మాట్లాడుతూ.. ‘ఆజమ్‌ఖాన్‌ క్షమాపణలు చెప్పకపోతే ఆయనపై తగిన చర్యలు తీసుకుంటారు’ అని వెల్లడించారు. 

ట్రిపుల్‌ తలాక్‌పై చర్చ సందర్భంగా భాజపా ఎంపీ రమాదేవిపై ఆజమ్‌ఖాన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చర్చ సందర్భంగా మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ మాట్లాడుతుండగా ఎస్పీ నేత ఆజమ్‌ఖాన్‌ పలుమార్లు అడ్డుపడ్డారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న రమాదేవి కలుగజేసుకుని.. ‘ఇటూఅటూ చూడవద్దు’ అని ఖాన్‌ను ఉద్దేశించి అన్నారు. ఆయన రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో దుమారం చెలరేగింది. ఈ క్రమంలో ఖాన్‌ స్పందిస్తూ... రమాదేవిని అగౌరవపరిచే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఆమె తనకు ప్రియమైన సోదరి వంటి వారన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.