Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 133712
            [news_title_telugu_html] => 

క్షమాపణలు చెప్పిన ఆజంఖాన్‌

[news_title_telugu] => క్షమాపణలు చెప్పిన ఆజంఖాన్‌ [news_title_english] => Azam Khan apologises for remarks against BJP MP Rama Devi [news_short_description] => భాజపా మహిళా ఎంపీ రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ క్షమాపణలు చెప్పారు. ఆజంఖాన్‌ వ్యాఖ్యలపై గతవారం లోక్‌సభలో తీవ్ర దుమారం రేగిన [news_tags_keywords] => Azam Khan,SP,Loksabha,BJP,Rama Devi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => | https://www.youtube.com/embed/JdWL94zo7DM [news_videoinfo] => | https://www.youtube.com/embed/JdWL94zo7DM [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-29 12:25:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
క్షమాపణలు చెప్పిన ఆజంఖాన్‌ - Azam Khan apologises for remarks against BJP MP Rama Devi - EENADU
close

తాజా వార్తలు

క్షమాపణలు చెప్పిన ఆజంఖాన్‌

దిల్లీ: భాజపా మహిళా ఎంపీ రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై గతవారం లోక్‌సభలో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీలకతీతంగా మహిళా ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో భేటీ అయిన స్పీకర్ ఓం బిర్లా ఆజంఖాన్‌ క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. 

ఈ నేపథ్యంలో సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే ఆజంఖాన్‌ మాట్లాడేందుకు స్పీకర్‌ అనుమతినిచ్చారు. అనంతరం సభాసమక్షంలో ఆయన క్షమాపణలు తెలిపారు. ‘నేను 9 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. మంత్రివర్గ బాధ్యతలు చేపట్టా. రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగానూ వ్యవహరించా. చట్టపరమైన విధానాల గురించి నాకు తెలుసు. ఒకవేళ నా వ్యాఖ్యలు ఎవర్నైనా బాధించి ఉంటే అందుకు నేను క్షమాపణలు చెబుతున్నా’ అని ఆజంఖాన్‌ తెలిపారు. 

ఆ తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ.. సభ్యులు ప్రసంగించేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి అనుచిత పదాలు ఉపయోగించకుండా సభ మర్యాదను కాపాడాలని కోరారు. అప్పుడే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉంటాయన్నారు. అయితే ఈ క్షమాపణలు తాను అంగీకరించబోనని భాజపా ఎంపీ రమాదేవి అన్నారు. ‘ఆయన నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారు. ఆజంఖాన్‌ ప్రవర్తన మహిళలతో పాటు యావత్‌ దేశాన్ని బాధిస్తోంది. ఆయన తన మాట తీరును మార్చుకోవాలి’ అని రమాదేవి హితవు పలికారు. 

ట్రిపుల్‌ తలాక్‌పై చర్చ సందర్భంగా భాజపా ఎంపీ రమాదేవిపై ఆజంఖాన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చర్చ సందర్భంగా మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ మాట్లాడుతుండగా ఎస్పీ నేత ఆజంఖాన్‌ పలుమార్లు అడ్డుపడ్డారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న రమాదేవి కలుగజేసుకుని.. ‘ఇటూ అటూ చూడవద్దు’ అని ఖాన్‌ను ఉద్దేశించి అన్నారు. ఆయన రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో దుమారం చెలరేగింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ సహా అన్ని పార్టీల మహిళా ఎంపీలు డిమాండ్‌ చేశారు.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.