Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 137708
            [news_title_telugu_html] => 

కశ్మీర్‌ అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలి

[news_title_telugu] => కశ్మీర్‌ అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలి [news_title_english] => Congress Mp Manish Tiwati speech in Loksabha [news_short_description] => విలీన ఒప్పందంపై రాజాహరిసింగ్‌ సంతకం చేశాకే అప్పటి ప్రధాని నెహ్రూ కశ్మీర్‌కు సేనలను పంపారని, భారత సేనలు వీరోచితంగా పోరాడి కశ్మీర్‌ భూభాగాన్ని కాపాడాయని [news_tags_keywords] => Delhi,Loksabha,Manish tiwari [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-06 12:51:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కశ్మీర్‌ అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలి - Congress Mp Manish Tiwati speech in Loksabha - EENADU
close

తాజా వార్తలు

కశ్మీర్‌ అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలి

కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ

దిల్లీ: విలీన ఒప్పందంపై రాజాహరిసింగ్‌ సంతకం చేశాకే అప్పటి ప్రధాని నెహ్రూ కశ్మీర్‌కు సేనలను పంపారని, భారత సేనలు వీరోచితంగా పోరాడి కశ్మీర్‌ భూభాగాన్ని కాపాడాయని కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ అన్నారు. జమ్ముకశ్మీర్‌ పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే జమ్ము-కశ్మీర్‌ భారత్‌లో విలీనమైందన్నారు. పాక్‌తో ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ధర్మనిరతి కలిగిన భారత్‌వైపే రాజాహరిసింగ్‌ అప్పట్లో మొగ్గు చూపారని లోక్‌సభలో ప్రస్తావించారు. కానీ, ఇప్పుడు మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని భాజపాపై మండిపడ్డారు. 

‘‘ఇప్పుడు జమ్ము-కశ్మీర్‌లో శాసనసభ లేదు. రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఆ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం రాజ్యాంగ విరుద్ధం. ఏదైనా రాష్ట్ర విభజన  చేయాలనుకున్నప్పుడు ఆ శాసనసభ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో అక్కడి శాసనసభను సంప్రదించే కాంగ్రెస్‌ విభజన చేసింది.’’ అని మనీష్‌ తివారీ అన్నారు.
దేశంలో ఎన్నో రాష్ట్రాలకు ప్రత్యేక అధికరణ కింద కొన్ని వెసులు బాట్లు కల్పించారని, ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా ఆ రాష్ట్రాలకు ఏం సందేశం పంపాలనుకుంటున్నారని పాలక పక్షాన్ని ప్రశ్నించారు. జమ్ము-కశ్మీర్‌ రాజ్యాంగ సభ అనుమతి లేనిదే ఆర్టికల్‌ 370ని రద్దు చేయలేరని మనీష్‌ తివారీ అభ్యంతరం వ్యక్తం చేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.