Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 137759
            [news_title_telugu_html] => 

మసూదీ వ్యాఖ్యలపై అమిత్‌షా ఆగ్రహం

[news_title_telugu] => మసూదీ వ్యాఖ్యలపై అమిత్‌షా ఆగ్రహం [news_title_english] => Union Home Minister Amitshah Fires on MP Masoodi Comments [news_short_description] => జమ్మూకశ్మీర్‌ విభజన అంశంలో ప్రవేశపెట్టిన బిల్లులపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఆర్టికల్‌ 370ను జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ... [news_tags_keywords] => Amitshah,Article 370,JammuKashmir,Loksabha [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-06 15:50:08 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మసూదీ వ్యాఖ్యలపై అమిత్‌షా ఆగ్రహం - Union Home Minister Amitshah Fires on MP Masoodi Comments - EENADU
close

తాజా వార్తలు

మసూదీ వ్యాఖ్యలపై అమిత్‌షా ఆగ్రహం

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ విభజన అంశంలో ప్రవేశపెట్టిన బిల్లులపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఆర్టికల్‌ 370ను జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్వాగతించారంటూ నేషనల్ కాన్ఫరెన్స్‌ ఎంపీ హసనైన్‌ మసూదీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఎప్పుడూ ఆర్టికల్‌ 370ను సమర్థించలేదని.. దాన్ని రద్దు చేయాలని పోరాడారని చెప్పారు. ఈ విషయంలో మసూదీ సత్యదూరమైన మాటలు చెబుతున్నారని అమిత్‌ షా ఆరోపించారు. ఆర్టికల్‌ 370ను శ్యామా ప్రసాద్‌ స్వాగతించినట్లు ఆధారాలు చూపాలని ఆయన సవాల్‌ విసిరారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లాను ఎవరూ అరెస్ట్‌ చేయలేదని.. ఆయన ఇంట్లోనే ఉన్నారని షా చెప్పారు. ఫరూక్‌ గైర్హాజరీ అంశంపై సభలో డీఎంకే సభ్యులు ప్రశ్న లేవనెత్తిన నేపథ్యంలో అమిత్‌షా ఈవిధంగా స్పందించారు.  అనంతరం మసూదీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 125 కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. ఆర్టికల్‌ 370 రద్దు బిల్లును జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఎందుకు పంపలేదని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంలో అక్కడి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అని మసూదీ మండిపడ్డారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.