Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 137812
            [news_title_telugu_html] => 

కశ్మీర్‌ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

[news_title_telugu] => కశ్మీర్‌ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం [news_title_english] => Kashmir bill passed in Loksabha [news_short_description] => జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ బిల్లును మంగళవారం లోక్‌సభలో.. [news_tags_keywords] => Article 370, Jammukashmir, Loksabha [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/CbXTCCSjHZE [news_videoinfo] => |https://www.youtube.com/embed/CbXTCCSjHZE [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-06 19:10:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కశ్మీర్‌ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం - Kashmir bill passed in Loksabha - EENADU
close

తాజా వార్తలు

కశ్మీర్‌ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దుతో పాటు రాష్ట్ర పునర్విభజనపై ప్రతిపాదించిన బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. వాడీవేడి చర్చ అనంతరం మంగళవారం ఓటింగ్‌ నిర్వహించారు. ఆర్టికల్‌ 370 రద్దు బిల్లుకు అనుకూలంగా 351మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేయగా.. కశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు అనుకూలంగా 370 మంది, 70 వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఈ రెండు బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందాయి. 

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా సోమవారం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో అక్కడ చర్చ తర్వాత స్లిప్పులతో ఓటింగ్‌ నిర్వహించగా.. ఈ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందినట్టయింది. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో భారత రాజ్యాంగం సంపూర్ణంగా అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమలుతో సహజంగానే రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ బిల్లులు ఆమోదం తర్వాత లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

 జమ్మూకశ్మీర్‌ను రెండు విభజిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ-కశ్మీర్‌ను ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ను అసెంబ్లీలేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటుచేసింది. ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఉభయసభలూ ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపనున్నారు. ఆయన ఆమోదం తర్వాత బిల్లు చట్టరూపం దాల్చనుంది. 

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.