close

తాజా వార్తలు

సుష్మాస్వరాజ్‌ కన్నుమూత

దిల్లీ: భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ (67) మంగళవారం రాత్రి  కన్నుమూశారు. గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే  కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్‌ వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సుష్మాస్వరాజ్‌కు భర్త, కుమార్తె ఉన్నారు. ఇటీవలే సుష్మాస్వరాజ్‌ మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకున్నారు. అనారోగ్య కారణాలతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.  

1953 ఫిబ్రవరి 14న హర్యాణాలోని అంబాలలో జన్మించిన సుష్మా..  1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఏడుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1977లో 25 ఏళ్ల వయసులోనే హరియాణా కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.  గతంలో సుష్మాస్వరాజ్‌ సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఆమె భర్త కౌశల్‌  ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. మోదీ ప్రభుత్వంలో సుష్మాస్వరాజ్‌ 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా  ఉన్నారు. దిల్లీ ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు 15వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. . 1998 అక్టోబర్‌ 13 నుంచి దిసెంబరు 3వరకు దిల్లీ సీఎంగా పనిచేశారు. గతంలో వాజ్‌పేయీ హయాంలో మంత్రిగా  పనిచేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.