close

తాజా వార్తలు

17 ఏళ్లలో ఇవే అత్యుత్తమ సమావేశాలు

దిల్లీ: రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది. ఈ సమావేశాల్లో మొత్తం 32 బిల్లులకు ఆమోదం లభించింది. గత 17 ఏళ్లలో ఈ సమావేశాలే అత్యుత్తమమని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ప్రశంసించారు. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ మృతికి సభ సంతాపం ప్రకటించింది. అనంతరం నాలుగు బిల్లులకు ఆమోదం లభించింది.

మరోవైపు లోక్‌సభ మంగళవారమే నిరవధికంగా వాయిదా పడింది. ‘370’ రద్దు తీర్మానం, జమ్మూ-కశ్మీర్‌ విభజన బిల్లు ఆమోద ముద్ర అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ట్రిపుల్‌ తలాక్‌ సహా పలు కీలక బిల్లులకు ఆమోద ముద్ర పడింది.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.