close

తాజా వార్తలు

సంయమనం పాటించండి!

భారత్‌-పాక్‌లకు ఐరాస సూచన

దిల్లీ: జమ్ముకశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. దీనిపై ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్ మాట్లాడారు. ఈ అంశంలో భారత్‌, పాక్‌ సంయమనం పాటించాలని కోరారు. జమ్ముకశ్మీర్‌ను ప్రభావితం చేసే చర్యలు తీసుకోకుండా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సిమ్లా ఒప్పందాన్ని ఆయన పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మోదీ సర్కారు విభజించిన విషయం తెలిసిందే.  మరోవైపు పాకిస్థాన్‌ ఈ విషయంలో అనవసరంగా తలదూరుస్తూ అత్యుత్సాహం చూపుతోంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఐక్య రాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది. అంతర్జాతీయ సమాజం కశ్మీర్‌ అంశంవైపు చూడాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఐక్యరాజ్య సమితిని కోరారు. ఈ నేపథ్యంలో ఐరాస ఈ అంశంపై స్పందించింది.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.