Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 139355
            [news_title_telugu_html] => 

‘అజాం ఖాన్‌ను ఏడాది పాటు బహిష్కరించారు’

[news_title_telugu] => ‘అజాం ఖాన్‌ను ఏడాది పాటు బహిష్కరించారు’ [news_title_english] => Azam Khan Was Expelled From AMU For Misbehaving With Woman says Shia cleric [news_short_description] => సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ ఆజమ్‌ ఖాన్‌ ఇటీవల ఓ వివాదం నుంచి బయటపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఆయన మహిళలపై... [news_tags_keywords] => Azam Khan,SP,Loksabha [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-09 15:50:30 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘అజాం ఖాన్‌ను ఏడాది పాటు బహిష్కరించారు’ - Azam Khan Was Expelled From AMU For Misbehaving With Woman says Shia cleric - EENADU
close

తాజా వార్తలు

‘అజాం ఖాన్‌ను ఏడాది పాటు బహిష్కరించారు’

షియా మతగురువు సంచలన వ్యాఖ్యలు

అలీగఢ్‌: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ అజాం ఖాన్‌ ఇటీవల ఓ వివాదం నుంచి బయటపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఆయన మహిళలపై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. తాజాగా ఆయనపై ప్రముఖ షియా మతగురువు మౌలానా కల్బే జవ్వాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం(ఏఎంయూ)లో చదువుకునే సమయంలో అజాం ఖాన్‌ ఏడాది పాటు బహిష్కరణకు గురయ్యారని కల్బే వ్యాఖ్యానించారు.  లా చదివే సమయంలో అజాంఖాన్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌ యూనియన్‌ సెక్రటరీగా పనిచేశారని తెలిపారు. నిబంధలను ఉల్లంఘించి మహిళలు ఉండే వార్డుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అందుకు గానూ ఏడాది పాటు ఆయన కళాశాల నుంచి బహిష్కరణకు గురయ్యారని తెలిపారు. యూనివర్సిటీలో ఈ వివాదంపై కమిటీ కూడా ఏర్పాటు చేశారని, అజాంను నిందితుడిగా ఆ కమిటీ తేల్చిందన్నారు. దీంతో 1976 అక్టోబరు 6న కాలేజ్‌ నుంచి ఆయనను బహిష్కరించారని తెలిపారు. 

లోక్‌సభ ఎన్నికల సమయంలో భాజపా అభ్యర్థి జయప్రద మీద అజాం ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పెద్ద దుమారమే రేగింది. తాజాగా ముమ్మారు తలాక్‌ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు పార్లమెంట్‌లో భాజపా నేత రమాదేవిపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలని భాజపా నేతలు డిమాండ్‌ చేశారు. ఆయన అందుకు నిరాకరించడంతో పార్లమెంట్‌ నుంచి బహిష్కరించాలని డిమాండ్లు వచ్చాయి. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.


 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.