close

తాజా వార్తలు

ఆధునిక భారతంలో అధునాతన పార్లమెంట్‌ నిర్మాణం!

దిల్లీ: నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలన్న ఆలోచన ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. ప్రస్తుత అవసరాలకు తగినట్టు ఆధునిక భవనం అవసరం ఉందని ఆయన వెల్లడించారు. లేదా ప్రస్తుత భవన సముదాయాన్నే విస్తరించి, సుందరీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం పార్లమెంటేరియన్స్‌, ప్రజల నుంచి సలహాలు స్వీకరించేందుకు కొన్ని కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. భారత్‌కు స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా చేసిన ‘సరికొత్త భారత్‌’ ప్రతిపాదనలో పార్లమెంటు భవన ఆధునికీకరణ, విస్తరణ చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీని ఓం బిర్లా కోరారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నిలయమైన భారత పార్లమెంటు అధునాతనంగా, ఆకర్షణీయంగా ఉండాలని ఓం బిర్లా అభిలషించారు. అది మనందరి కలల ప్రతిరూపమని వర్ణించారు. ఈ మధ్యే ముగిసిన లోక్‌సభ సమావేశాలు ఒక్కసారీ వాయిదా పడలేదని ఆయన వెల్లడించారు. ‘ఈ పార్లమెంటు సెషన్‌లో లోక్‌సభను ఒక్కసారీ వాయిదా వేయలేదు. ఫలితంగా కేటాయించిన దానికన్నా 72 గంటలు అదనంగా సభ నడిచింది. ఇది 12 సమావేశాలకు (సిట్టింగులు) సమానం. లోక్‌సభలో చర్చలు సవ్యంగా సాగితే, సభ్యులు ఎక్కువ సమయం కూర్చోవడం అంటే దేశానికి సానుకూల సందేశం పంపించడం అన్నమాట’ అని స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.