Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141949
            [news_title_telugu_html] => 

పంట రుణాల చెల్లింపు గడువు పెంచండి

[news_title_telugu] => పంట రుణాల చెల్లింపు గడువు పెంచండి [news_title_english] => Rahul Gandhi writes a letter to the Governor of Reserve Bank of India on Kerala floods [news_short_description] => గతేడాది కేరళను వరదలు ముంచెత్తినందువల్ల రైతులు బ్యాంకులకు చెల్లించే పంట రుణాల గడువు తేదీని ఈ ఏడాది చివరి వరకూ పొడగించాలని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు... [news_tags_keywords] => Kerala floods, Rahul Gandhi, letter, Reserve Bank of India, Shaktikanta Das [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-14 21:20:24 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పంట రుణాల చెల్లింపు గడువు పెంచండి - Rahul Gandhi writes a letter to the Governor of Reserve Bank of India on Kerala floods - EENADU
close

తాజా వార్తలు

పంట రుణాల చెల్లింపు గడువు పెంచండి

ఆర్‌బీఐకి రాహుల్‌ గాంధీ లేఖ

దిల్లీ: గతేడాది కేరళను వరదలు ముంచెత్తడంతో రైతులు బ్యాంకులకు చెల్లించే పంట రుణాల గడువు తేదీని ఈ ఏడాది చివరి వరకూ పొడిగించాలని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆర్‌బీఐని కోరారు. ఈ మేరకు బుధవారం రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు రాహుల్‌ లేఖ రాశారు. శతాబ్ద కాలంలో ఎప్పుడూ చూడని వరదలతో కేరళ ప్రజలు బాగా నష్టపోయారని, పంటలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయని వివరించారు. దీనికి తోడు మద్దతు ధరలు పడిపోవడం వంటి పరిణామాలు కోలుకోలేని దెబ్బతీశాయని వెల్లడించారు. పంట రుణాల వసూలు కోసం నిస్సహాయులైన అన్నదాతలపై బ్యాంకులు ఒత్తిడి తెస్తే రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరిగే అవకాశముందని అన్నారు. 

రుణాల చెల్లింపు గడువును పెంచాలనే ఈ అభ్యర్థన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు చేసినప్పటికీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఇందుకు నిరాకరించిందని రాహుల్‌ వివరించారు. రుణాల చెల్లింపు గడువు పెంచేలా ఆర్‌బీఐ చొరవ చూపాలని రాహుల్‌ కోరారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.