Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142965
            [news_title_telugu_html] => 

పింఛను లేకుండా ఆర్మీ ఉన్నతాధికారికి ఉద్వాసన

[news_title_telugu] => పింఛను లేకుండా ఆర్మీ ఉన్నతాధికారికి ఉద్వాసన [news_title_english] => A Major General Rank Army Officer Working In Assam Rifles Dismissed Without Pension Due to Sexual Harassment [news_short_description] => లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఓ ఆర్మీ ఉన్నతాధికారిని విధుల నుంచి తొలగించారు. అసోం రైఫిల్స్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న... [news_tags_keywords] => Major General, Dismissed, Assam Rifles, Without Pension, Sexual Harassment [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 00:33:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పింఛను లేకుండా ఆర్మీ ఉన్నతాధికారికి ఉద్వాసన - A Major General Rank Army Officer Working In Assam Rifles Dismissed Without Pension Due to Sexual Harassment - EENADU
close

తాజా వార్తలు

పింఛను లేకుండా ఆర్మీ ఉన్నతాధికారికి ఉద్వాసన

లైంగిక వేధింపులే కారణం

దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఆర్మీ ఉన్నతాధికారిని విధుల నుంచి తొలగించారు. అసోం రైఫిల్స్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న మేజర్‌ జనరల్‌ ర్యాంకు ఆర్మీ అధికారికి కనీసం పింఛను అందే వెసులుబాటు కూడా లేకుండా ఉద్వాసన పలకడం గమనార్హం. ఈ విషయాన్ని సదరు అధికారికి ఇప్పటికే తెలియపర్చినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ఓ జాతీయ వార్తా సంస్థకు తెలిపారు. ఈయన తొలగింపునకు సంబంధించిన దస్త్రాలపై భారత సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ గత జులైలోనే సంతకం చేసినా, సైనిక కోర్టు శుక్రవారం ధ్రువీకరించింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మేజర్‌ జనరల్‌ను తొలగించాలని సైనిక కోర్టు గతేడాది డిసెంబరులోనే ప్రతిపాదించింది. 
మేజర్‌ జనరల్‌పై లైంగిక వేధింపుల కేసు 2016 చివర్లో నమోదైంది. హరియాణాలోని చండీ మందిర్‌లో విధులు నిర్వర్తించేటప్పుడు తనను లైంగికంగా వేధించారని ఓ కెప్టెన్‌ ర్యాంకు మహిళా ఆర్మీ అధికారి ఆరోపించారు. మరోవైపు తనపై వస్తున్న అభియోగాలను మేజర్‌ జనరల్‌ ఖండిస్తున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.