Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143384
            [news_title_telugu_html] => 

కశ్మీర్‌పై బయటి జోక్యం అవసరం లేదు

[news_title_telugu] => కశ్మీర్‌పై బయటి జోక్యం అవసరం లేదు [news_title_english] => Ending Kashmirs special status entirely internal matter with no external ramifications India [news_short_description] => జమ్మూ-కశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయం పూర్తిగా అంతర్గత అంశమని భారత్‌ మరోసారి తెగేసి చెప్పింది. ఈ విషయంలో ఎటువంటి బయటి జోక్యం అవసరం లేదని  తేల్చి చెప్పింది. ఉగ్రవాదానికి స్వస్తి పలికితేనే పాక్‌తో చర్చలుంటాయని తేల్చి చెప్పింది............. [news_tags_keywords] => UNSC,Pakistan,India,China,Jammu kashmir [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => pdtcOgN7O48 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 09:17:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కశ్మీర్‌పై బయటి జోక్యం అవసరం లేదు - Ending Kashmirs special status entirely internal matter with no external ramifications India - EENADU
close

తాజా వార్తలు

కశ్మీర్‌పై బయటి జోక్యం అవసరం లేదు

ఐరాస: జమ్మూ-కశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయం పూర్తిగా అంతర్గత అంశమని భారత్‌ పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ఎటువంటి బయటి జోక్యం అవసరం లేదని  తెగేసి చెప్పింది. ఉగ్రవాదానికి స్వస్తి పలికితేనే పాక్‌తో చర్చలుంటాయని తేల్చి చెప్పింది. కశ్మీర్‌పై శుక్రవారం ఐరాస భద్రతా మండలిలో రహస్య సంప్రదింపులు జరిగిన నేపథ్యంలో భారత్‌ మరోసారి తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజానికి గట్టిగా వినిపింది. పాక్‌, చైనాల కోరిక మేరకు జరిగిన ఈ సమావేశానంతరం ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ మీడియాతో మాట్లాడారు. అధికరణ 370రద్దు విషయంలో భారత్‌ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి బయటి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పారు. కొంత మంది కశ్మీర్‌లో ఏదో జరుగుతుంది అనే ధోరణి ప్రదర్శించి అంతర్జాతీయ సమాజానికి తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని..వారి ఆరోపణలు పూర్తిగా సత్యదూరమని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ అన్నారు.

ఏవైనా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగడానికి కొన్ని సాధారణ నియమాలు ఉంటాయని.. వాటిని ఉభయ పక్షాలు గౌరవించాల్సి ఉంటుందని అక్బరుద్దీన్‌ అన్నారు. అలాగైతేనే చర్చలకు సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. పాక్‌ సైతం ఉగ్రవాదానికి స్వస్తి పలికితేనే చర్చలకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కశ్మీర్‌పై ఎంత గగ్గోలు పెట్టినా నిరుపయోగమేనని చెప్పారు. జమ్మూకశ్మీర్‌ ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలనే సద్భావనతోనే అధికరణ 370ని రద్దు చేశామని వివరించారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఒక ప్రాంతీయ అంశాన్ని పాక్‌, చైనా అంతర్జాతీయ సమస్యగా చూపే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన చైనా, పాక్‌ ప్రతినిధులు తమ గొంతుకను విశ్వవేదికపై వినిపించామంటూ బీరాలకు పోయారు. కానీ పాక్‌ మీడియా మాత్రం తమ పక్షాన చైనా తప్ప ఎవరూ మిగలలేదని కుండ బద్దలు కొట్టింది. విలేకరుల నుంచి ప్రశ్నలు స్వీకరించడానికి ఆ దేశాల ప్రతినిధులు విముఖత వ్యక్తం చేయడం గమనార్హం. 

ఐరాస భద్రతా మండలి కశ్మీర్‌పై అసాధారణ రీతిలో శుక్రవారం రహస్య సంప్రదింపులు జరిపింది. పాక్‌, చైనా ఇచ్చిన లేఖ ఆధారంగా ఈ భేటీ జరిగింది. భారత్‌, పాక్‌ ప్రతినిధులకు ఇందులో అవకాశం కల్పించలేదు. సమావేశంలో పాల్గొన్న రష్యా ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘రహస్య సంప్రదింపుల్లో అభిప్రాయాలను పంచుకుంటాం. ఏమి జరగాలి, ఏమి జరగకూడదు అన్నదానిపై చర్చిస్తాం. ఇది చాలా సాధారణ ప్రక్రియ’’ అని అన్నారు. మరో ప్రశ్నకు స్పందిస్తూ ‘‘కొన్ని సమయాల్లో ఇలాంటి సమస్యను ముట్టుకోకపోవడమే మంచిది. ఇది ద్వైపాక్షిక సమస్య’’ అని చెప్పి పరోక్షంగా కశ్మీర్‌ సమస్య అంతర్జాతీయ సమస్య కాదని స్పష్టం చేశారు. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.