Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143407
            [news_title_telugu_html] => 

బాయ్‌ఫ్రెండ్‌ పక్కన సీటు ఇవ్వలేదని..

[news_title_telugu] => బాయ్‌ఫ్రెండ్‌ పక్కన సీటు ఇవ్వలేదని.. [news_title_english] => flyer threw hot water at air hostess [news_short_description] => ప్రతి ప్రయాణికుడిని నవ్వుతూ పలకరించడం.. ప్రతి సీటు వద్దకు వెళ్లి వాళ్లకు కావాల్సినవి అందించడం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనాన్ని కోల్పోకుండా ఉండటం.. ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేయడం అంటే అంత సులువు కాదు [news_tags_keywords] => AirAsia,Passenger,Rude Behaviour,Airhostess [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 12:02:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బాయ్‌ఫ్రెండ్‌ పక్కన సీటు ఇవ్వలేదని.. - flyer threw hot water at air hostess - EENADU
close

తాజా వార్తలు

బాయ్‌ఫ్రెండ్‌ పక్కన సీటు ఇవ్వలేదని..

ఎయిర్‌హోస్టెస్‌పై వేడి నీరు విసిరిన ప్రయాణికురాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి ప్రయాణికుడిని నవ్వుతూ పలకరించడం.. ప్రతి సీటు వద్దకు వెళ్లి వాళ్లకు కావాల్సినవి అందించడం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనాన్ని కోల్పోకుండా ఉండటం.. ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేయడం అంటే అంత సులువు కాదు. ఇన్ని చేస్తున్నా కొన్నిసార్లు వీరిపై ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తూనే ఉంటారు. తాజాగా ఓ ఎయిర్‌ఏషియా విమానంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. బాయ్‌ఫ్రెండ్‌ పక్కన సీటు అడిగితే ఇవ్వలేదని ఓ ప్రయాణికులు అమానవీయంగా ప్రవర్తించింది. ఆమె ముఖంపై న్యూడిల్స్‌లోని వేడి నీరు విసిరికొట్టింది. 

ఎయిర్‌ఏషియాలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న నురాలియా మజ్లాన్‌ తన సహోద్యోగికి విమానంలో ఎదురైన భయానక అనుభవాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా షేర్‌ చేశారు. చైనాకు చెందిన ఓ యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌ ఎయిర్‌ఏషియా విమానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. అయితే వారికి పక్కపక్క సీట్లు రాలేదు. దీంతో తన బాయ్‌ఫ్రెండ్‌ పక్కన సీట్లో తనకు సీట్‌ సర్దుబాటు చేయాలని విమాన సిబ్బందిని కోరింది. 

అయితే విమానంలో సీట్లన్నీ నిండిపోవడం, సీట్ల మార్పునకు ఎవరూ ఒప్పుకోకపోవడంతో తాను సర్దుబాటు చేయలేకపోతున్నానని ఎయిర్‌హోస్టెస్‌ సదరు ప్రయాణికురాలికి చెప్పింది. ఈ సమాధానం విన్న ఆ చైనీస్‌ యువతి కోపంతో రగిలిపోయింది. ఆవేశంలో తన చేతిలో ఉన్న న్యూడిల్స్‌ కప్పులోని వేడి నీటిని ఎయిర్‌హోస్టెస్‌ ముఖంపై విసిరిగొట్టింది. అంతటితో ఆగకుండా గట్టిగా కేకలు వేసింది. ఇతర సిబ్బంది సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు. ఇక ఆ ప్రయాణికురాలి బాయ్‌ఫ్రెండ్‌ కూడా మరింత రెచ్చిపోయి విమానాన్ని పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 

ఎలాగొలా గొడవను ఆపిన సిబ్బంది విమానం గమ్యస్థానానికి చేరగానే ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకెప్పుడూ ఆ యువతి ఎయిర్‌ఏషియాలో ప్రయాణించకుండా విమానయాన సంస్థ ఆమెపై నిషేధం విధించింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.