Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143499
            [news_title_telugu_html] => 

జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల ఆంక్షల సడలింపు

[news_title_telugu] => జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల ఆంక్షల సడలింపు [news_title_english] => Restrictions Eased In Parts of Jammu Kashmir [news_short_description] => జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విధించిన... [news_tags_keywords] => JammuKashmir,Restrictions,Article370 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 17:40:54 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల ఆంక్షల సడలింపు - Restrictions Eased In Parts of Jammu Kashmir - EENADU
close

తాజా వార్తలు

జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల ఆంక్షల సడలింపు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విధించిన కఠిన ఆంక్షలను అక్కడి అధికార యంత్రాంగం క్రమంగా సడలిస్తోంది. తద్వారా కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. తాజాగా, కశ్మీర్‌ వ్యాలీలో 50వేల ల్యాండ్‌ ఫోన్‌ కనెక్షన్ల సేవలను పునరుద్ధరించారు. అలాగే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షిస్తూ జమ్మూకశ్మీర్‌లో విధించిన నిషేధాజ్ఞల్ని పలుచోట్ల సడలించారు. జమ్మూలోని ఐదు జిల్లాల్లో  మొబైల్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్లను అధికారులు పునరుద్ధరించారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 100 టెలిఫోన్‌ ఎక్సేంజీలు ఉండగా.. 17 టెలిఫోన్‌ ఎక్సేంజీలు పనిచేస్తున్నాయి. బూద్గాం, సోనామార్గ్‌, మనిగం, గురెజ్‌, టాంగ్‌మార్గ్‌, ఉరీ కెరన్‌, టాంగ్‌ధర్‌ తదితర ప్రాంతాల్లో లాండ్‌లైన్‌ సర్వీసుల్ని పునరుద్ధరించారు. మరో 20 టెలిఫోన్‌ ఎక్సేంజీలను త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

అందుబాటులోకి ప్రజారవాణా!

జమ్మూకశ్మీర్‌లో మోహరించిన భద్రతా బలగాలను, రోడ్లపై ఏర్పాటుచేసిన బారికేడ్లను మాత్రం అలాగే కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ రవాణా పనిచేస్తోందని.. అలాగే జమ్మూ, రియాసి, సాంబా, కథువా, ఉదంపూర్‌ జిల్లాల్లో  2జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల్ని పునరుద్ధరించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిని సమీక్షించాక  హైస్పీడ్‌ (3జీ, 4జీ) మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల్ని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. అలాగే, కొన్ని ప్రాంతాల్లో దుకాణాలను తెరిచారు. వ్యాపార సంస్థలు, పెట్రోల్‌ బంక్‌లు ఇంకా తెరుచుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. 
సోమవారం నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
వచ్చే సోమవారం నుంచి పాఠశాలలన్నీ తెరుచుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. అయితే, పరిస్థితిని బట్టి ప్రాంతాల వారీగా పాఠశాలలను తెరుస్తామని చెప్పారు.  అలాగే, టెలికం సర్వీసులు కూడా దశలవారీగా పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.