Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143519
            [news_title_telugu_html] => 

దెయ్యాలను తరిమికొట్టే పండగ

[news_title_telugu] => దెయ్యాలను తరిమికొట్టే పండగ [news_title_english] => Hong Kong demon festival [news_short_description] => దెయ్యాలను తరిమికొట్టడానికి హాంగ్‌కాంగ్‌లో నిర్వహించే దెయ్యాల పండగ ప్రారంభమయ్యింది. దెయ్యాలను తరిమేయడానికి బోధిసత్వుడు ఘోస్ట్‌ మాస్టర్ అవతారమెత్తి వస్తాడని అక్కడి ప్రజల నమ్మకం. [news_tags_keywords] => Hong Kong ,demon festival [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => W1Klqd5r6Fk [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 20:13:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
దెయ్యాలను తరిమికొట్టే పండగ - Hong Kong demon festival - EENADU
close

తాజా వార్తలు

దెయ్యాలను తరిమికొట్టే పండగ

హాంగ్‌కాంగ్‌: దెయ్యాలను తరిమికొట్టడానికి హాంగ్‌కాంగ్‌లో నిర్వహించే దెయ్యాల పండగ ప్రారంభమయ్యింది. దెయ్యాలను తరిమేయడానికి బోధిసత్వుడు ఘోస్ట్‌ మాస్టర్ అవతారమెత్తి వస్తాడని అక్కడి ప్రజల నమ్మకం. యులాన్‌ పెస్టివల్‌గా పిలిచే ఈ వేడుకలు హాంగ్‌కాంగ్‌లోని చౌకేయువాన్‌ అనే ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు వినడానికి వింతగా ఉన్నా... డ్రమ్స్‌చప్పుళ్లు, తాళాల సందడితో అక్కడి ప్రజలు ఎంతో వైభవంగా ఈ పండగను జరుపుకొంటున్నారు. యులాన్‌ పెస్టివల్‌గా పిలిచే ఈ ఉత్సవాలను ‘ఆకలితో ఉన్న దెయ్యాల’ పండగగా పిలుస్తారు. చైనా కాలపట్టిక ప్రకారం.. ఏడో నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సమయంలోనే దెయ్యాలు నరకంలో నుంచి భూమి మీదకు వస్తాయని అక్కడ ప్రజల విశ్వాసం. ఈ సంవత్సరం హాంగ్‌కాంగ్‌లోని షాంగైవాన్‌ జిల్లాలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తోన్నారు. ఆత్మల దృష్టి మరల్చడానికి 16 అడుగుల పొడవైన దిష్టిబొమ్మను హాంగ్‌కాంగ్‌ వీధుల్లో ఊరేగిస్తారు. ఆల్‌డ్రిచ్‌ తీరంలోని ఆటస్థలం నుంచి దిష్టిబొమ్మల ఊరేగింపు ప్రారంభమవుతుంది. కాంటోనిస్‌ భాషలో డాయిసీవోంగ్‌ అని పిలిచే ఈ దిష్టిబొమ్మను ఘోస్ట్‌ మాస్టరుగా పిలుస్తారు. ఈ ఘోస్ట్‌ మాస్టర్‌ను అక్కడి ప్రజలు గువానియన్‌ అవతారంగా పిలుస్తారు. గువానియన్‌ అంటే బోధిసత్వుడు. అతడు ఘోస్ట్‌ మాస్టర్‌ అవతారమెత్తి బయటకు వచ్చే దెయ్యాలను తరుముతాడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ ఘోస్ట్‌ మాస్టర్‌ దిష్టి బొమ్మలను వెదురు కర్రలతో తయారు చేస్తారు. వాటిపై నుంచి కాగితాలు, వస్త్రాలతో అందంగా తీర్చిదిద్దుతారు. తల, కాలు, ఇతర శరీర భాగాలన్నీ విడివిడిగా తయారుచేసి చివరికి ఒకటిగా కలుపుతారు. వీటిని తయారు చేసే కార్మికుల కళానైపుణ్యాన్ని సాంస్కృతిక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఎప్పటికప్పుడు ఈ సంప్రదాయాన్ని ఆధునీకరిస్తూ వస్తున్నారు. పూర్వం ఘోస్ట్‌ మాస్టర్‌ సాదాసీదాగా ఉండేదని ఇప్పుడు దీన్ని ప్లోరోసెంట్‌ ఘోస్ట్‌ మాస్టర్‌ అని పిలుస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ భయంకరమైన దిష్టిబొమ్మలను చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తారు. తాత్కాలికంగా బయటకు వచ్చే దెయ్యాలను అణచివేయడంతో పాటు స్థానిక ప్రజల మధ్య సఖ్యతను పెంచడానికి ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ చైనీస్‌ కాగితపు కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి  ఈ ఉత్సవాలు ఉపయోగపడతాయన్నారు.

 

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.