Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143961
            [news_title_telugu_html] => 

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సీబీఐ చేతికి

[news_title_telugu] => ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సీబీఐ చేతికి [news_title_english] => Phone tapping case will be handed over to the CBI [news_short_description] => కర్ణాటక రాజకీయాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. జనతాదళ్‌ మాజీ అధ్యక్షుడు హెచ్‌ విశ్వనాథం బుధవారం చేసిన ఆరోపణలతో........... [news_tags_keywords] => BS Yediyurappa,Karnataka,Kumaraswamy [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 12:09:09 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సీబీఐ చేతికి - Phone tapping case will be handed over to the CBI - EENADU
close

తాజా వార్తలు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సీబీఐ చేతికి

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. జేడీఎస్‌ మాజీ అధ్యక్షుడు హెచ్‌ విశ్వనాథం బుధవారం చేసిన ఆరోపణలతో రాష్ట్రంలోని నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చర్చకు దారి తీస్తున్న ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపిస్తున్నట్లు ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదివారం ప్రకటించారు. ఈ కేసును సీబీఐకి అప్పజెప్పనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్‌ నేతల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంపై విచారణ జరిపిస్తామన్నారు.

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన అనుచర గణానికి చెందిన ఫోన్లను ట్యాప్‌ చేశారని మిత్ర పక్షమైన జేడీఎస్‌ ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీనిపై లోతుగా విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పట్టుబడుతోంది. అయితే ఈ ఆరోపణలను జేడీఎస్‌ తోసిపుచ్చుతోంది. రాజకీయ నేతలు, అధికారులంతా ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నట్లు సీఎల్‌పీ నేత సిద్ధరామయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు డిమాండ్‌ చేయటంతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంపై మాజీ ప్రధాని దేవెగౌడ కూడా ఫోను ట్యాపింగ్‌ ఎవరెలా చేశారో నాతో చెప్పించకండంటూ ఎదురు దాడికి దిగుతున్నారు. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ వ్యవహారం బయటకి రావడం వెనక అధికార భాజపా వ్యూహం కూడా ఉందన్న అనుమానాలు లేకపోలేదు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.