Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144459
            [news_title_telugu_html] => 

తరుణ్‌ తేజ్‌పాల్‌పై విచారణ కొనసాగాల్సిందే

[news_title_telugu] => తరుణ్‌ తేజ్‌పాల్‌పై విచారణ కొనసాగాల్సిందే [news_title_english] => SC dismisses Tarun Tejpals plea seeking quashing of charges [news_short_description] => తెహల్కా మ్యాగజైన్‌ వ్యవస్థాపకుడు, ప్రముఖ జర్నలిస్టు తరుణ్‌ తేజ్‌పాల్‌పై వచ్చిన అత్యాచార ఆరోపణలు చాలా తీవ్రమైనవని, వాటిపై విచారణ కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తనపై నమోదైన [news_tags_keywords] => Tarun Tejpal,Tehelka, Sexual assault case,Supreme Court [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => Nvd4FZ0SOBw [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 11:58:05 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తరుణ్‌ తేజ్‌పాల్‌పై విచారణ కొనసాగాల్సిందే - SC dismisses Tarun Tejpals plea seeking quashing of charges - EENADU
close

తాజా వార్తలు

తరుణ్‌ తేజ్‌పాల్‌పై విచారణ కొనసాగాల్సిందే

అత్యాచార కేసును కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

దిల్లీ: తెహల్కా మ్యాగజైన్‌ వ్యవస్థాపకుడు, ప్రముఖ జర్నలిస్టు తరుణ్‌ తేజ్‌పాల్‌పై వచ్చిన అత్యాచార ఆరోపణలు చాలా తీవ్రమైనవని, వాటిపై విచారణ కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తనపై నమోదైన అభియోగాలను కొట్టివేయాలంటూ తేజ్‌పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నాత న్యాయస్థానం తిరస్కరించింది. అంతేగాక.. తరుణ్‌ తేజ్‌పాల్‌ కేసులో ఆరు నెలల్లోగా విచారణ పూర్తిచేయాలని గోవా న్యాయస్థానాన్ని ఆదేశించింది. 

‘లైంగిక దాడి చాలా తీవ్రమైన నేరం. నైతికంగా చాలా అసహ్యకరమైన పని. ఈ కేసులో ఆరేళ్ల క్రితమే అభియోగాలు నమోదైనందున విచారణ ఇంకా ఆలస్యం చేయడం సరికాదు. ఆరు నెలల్లోగా కేసు విచారణ పూర్తి చేయండి’ అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గోవా న్యాయస్థానానికి సూచించింది. 

తరుణ్‌ తేజ్‌పాల్‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ తెహల్కాలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి 2013లో చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనానికి దారితీశాయి. ఆ ఏడాది గోవాలోని బాంబోలిమ్‌ ప్రాంతంలో గల ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్లో తెహల్కా థింక్‌ ఫెస్టివల్‌ జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన తనను తరుణ్‌ తేజపాల్‌ లిఫ్ట్‌లో అత్యాచారం చేశాడని సదరు మహిళ కేసు పెట్టారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన తేజ్‌పాల్‌ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు న్యాయస్థానం తిరస్కరించడంతో 2013 నవంబరు 30న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే 2014 మే నుంచి తేజ్‌పాల్‌ బెయిల్‌పై బయటే ఉన్నారు. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.