Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144464
            [news_title_telugu_html] => 

ఉన్నావ్‌ విచారణకు మరో రెండు వారాల గడువు

[news_title_telugu] => ఉన్నావ్‌ విచారణకు మరో రెండు వారాల గడువు [news_title_english] => SC grants CBI 2 more weeks to complete probe in accident case involving Unnao rape survivor [news_short_description] => ఉన్నావ్‌ ఘటన బాధితురాలి రోడ్డు ప్రమాదం కేసు విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి సుప్రీం కోర్టు మరో వారాల గడువు ఇచ్చింది. అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి తరఫు న్యాయవాదికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5లక్షల.............. [news_tags_keywords] => Supreme Court,Unnao,Accident [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 12:31:45 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఉన్నావ్‌ విచారణకు మరో రెండు వారాల గడువు - SC grants CBI 2 more weeks to complete probe in accident case involving Unnao rape survivor - EENADU
close

తాజా వార్తలు

ఉన్నావ్‌ విచారణకు మరో రెండు వారాల గడువు

దిల్లీ: ఉన్నావ్‌ ఘటన బాధితురాలి రోడ్డు ప్రమాదం కేసు విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి సుప్రీం కోర్టు మరో రెండు వారాల గడువు ఇచ్చింది. అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి తరఫు న్యాయవాదికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5లక్షల మధ్యంతర పరిహారం ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అత్యాచార ఘటనతో పాటు రోడ్డు ప్రమాదం కేసుపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. బాధితురాలి వాంగ్మూలాన్ని ఇంకా నమోదు చేయలేదని అందువల్ల విచారణకు మరో నాలుగు వారాల సమయం కావాలని సీబీఐ కోర్టుకు వివరించింది. అలాగే న్యాయవాది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరో రెండు వారాలు పొడిగించేందుకు కోర్టు అంగీకరించింది.

గతంలో విచారణ సందర్భంగా కేసులపై దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. రోడ్డు ప్రమాద కేసును వారం రోజుల్లోగా, అత్యాచార ఘటనపై 45 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని కోర్టు నిర్దేశించింది. కేవలం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మరో ఏడు రోజుల గడువును పొడగించవచ్చునని తెలిపింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.