Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144484
            [news_title_telugu_html] => 

ఆంక్షల సమయంలో గిలానీకి ఇంటర్నెట్‌ సేవలు

[news_title_telugu] => ఆంక్షల సమయంలో గిలానీకి ఇంటర్నెట్‌ సేవలు [news_title_english] => internet access to Syed Ali Geelani during Kashmir shutdown [news_short_description] => ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఇటీవల జమ్ముకశ్మీర్‌లో నిషేధాజ్ఞలు విధించారు. అవాంఛిత సంఘటనలు జరగకుండా ఫోన్‌కాల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ వేర్పాటువాది [news_tags_keywords] => Syed Ali Geelani ,Jammu and Kashmir,Article 370 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 17:38:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆంక్షల సమయంలో గిలానీకి ఇంటర్నెట్‌ సేవలు - internet access to Syed Ali Geelani during Kashmir shutdown - EENADU
close

తాజా వార్తలు

ఆంక్షల సమయంలో గిలానీకి ఇంటర్నెట్‌ సేవలు

ఇద్దరు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులపై వేటు

శ్రీనగర్‌: ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఇటీవల జమ్ముకశ్మీర్‌లో నిషేధాజ్ఞలు విధించారు. అవాంఛిత సంఘటనలు జరగకుండా ఫోన్‌కాల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ వేర్పాటువాది సయ్యద్‌ అలీ షా గిలానీకి మాత్రం నాలుగురోజులు ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో ఉండటం తాజాగా వివాదాస్పదంగా మారింది. దీంతో గిలానీకి సహకరించిన ఇద్దరు బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.  

ఆర్టికల్‌ 370 రద్దుకు ఒక రోజు ముందు అంటే ఆగస్టు 4న కశ్మీర్‌ వ్యాప్తంగా అన్ని కమ్యూనికేషన్‌ లైన్లను నిలిపివేశారు. ల్యాండ్‌లైన్లతో సహా మొబైల్‌ సేవలు, ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించారు. అయితే రాష్ట్రమంతా ఆంక్షలు ఉన్నప్పటికీ హురియత్‌ నేత గిలానీకి మాత్రం ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండటం గమనార్హం. ఆగస్టు 8 వరకు ఆయన ఇంటర్నెట్‌ సేవలతో పాటు ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ సేవలను కూడా వినియోగించుకున్నారు.

గిలానీ తన ట్విటర్ ఖాతా నుంచి ట్వీట్ చేయడంతో ఈ విషయం అధికారుల దృష్టిలో పడింది. దీంతో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసే ఇద్దరు ఉన్నతస్థాయి ఉద్యోగులు గిలానీకి సహకరించి ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించినట్లు విచారణలో తేలింది. దీంతో ప్రభుత్వం వారిని సస్పెండ్‌ చేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.