Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144505
            [news_title_telugu_html] => 

కశ్మీర్‌ ఎఫెక్ట్‌: బ్రిటన్ రాజదంపతుల పర్యటన రద్దు!

[news_title_telugu] => కశ్మీర్‌ ఎఫెక్ట్‌: బ్రిటన్ రాజదంపతుల పర్యటన రద్దు! [news_title_english] => Prince William Kate Middleton May Call Off Pakistan Visit [news_short_description] => కశ్మీర్‌ అంశం నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల దృష్ట్యా బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియమ్‌ దంపతులు తమ పాక్‌ పర్యటనను రద్దు చేసుకున్నట్లు [news_tags_keywords] => Prince William,Kate Middleton ,UK Royal Family,Pakistan,Kashmir Issue [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 23:37:42 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కశ్మీర్‌ ఎఫెక్ట్‌: బ్రిటన్ రాజదంపతుల పర్యటన రద్దు! - Prince William Kate Middleton May Call Off Pakistan Visit - EENADU
close

తాజా వార్తలు

కశ్మీర్‌ ఎఫెక్ట్‌: బ్రిటన్ రాజదంపతుల పర్యటన రద్దు!

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ అంశం నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల దృష్ట్యా బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియమ్‌ దంపతులు తమ పాక్‌ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దిల్లీ-ఇస్లామాబాద్‌ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజ దంపతుల పాక్‌ పర్యటన ఉండకపోవచ్చని బ్రిటన్‌ ఫారిన్‌, కామన్‌వెల్త్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఫారిన్‌, కామన్‌వెల్త్‌ కార్యాలయం అభ్యర్థన మేరకు ప్రిన్స్‌ విలియం, కేట్‌ మిడిల్డన్‌ ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్‌లో పర్యటించనున్నట్లు బ్రిటన్‌ రాజకుటుంబం జూన్‌లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారు పాక్‌కు వెళ్లే అవకాశాలు కన్పించట్లేదని తాజా సమాచారం. బ్రిటన్‌ రాజకుటుంబం నుంచి చివరిసారిగా 2006లో ప్రిన్స్‌ ఛార్లెస్‌, కెమిల్లా పాకిస్థాన్‌లో పర్యటించారు. అంతకుముందు 1991లో ప్రిన్సెస్‌ డయానా, 1961,1997లో క్వీన్‌ ఎలిజిబెత్‌ 2 ఆ దేశానికి వెళ్లారు. 

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన పాక్‌.. ఈ వ్యవహారాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించింది. అయితే అక్కడ విఫలమవడంతో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ అక్కసు వెళ్లగక్కుతోంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.