Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144521
            [news_title_telugu_html] => 

ఫోన్‌ట్యాపింగా..అలాంటిదేం లేదే!

[news_title_telugu] => ఫోన్‌ట్యాపింగా..అలాంటిదేం లేదే! [news_title_english] => DK Shivakumar sides with Kumaraswamy [news_short_description] => కొత్త ప్రభుత్వం ఏర్పడిన కర్ణాటకలో ప్రస్తుతం ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కుదిపేస్తోంది. అధికారాన్ని చేజార్చుకున్న షాక్‌ నుంచి ఇంకా తేరుకోకముందే........ [news_tags_keywords] => Kumaraswamy,DK Shivakumar,Karnataka [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 23:01:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఫోన్‌ట్యాపింగా..అలాంటిదేం లేదే! - DK Shivakumar sides with Kumaraswamy - EENADU
close

తాజా వార్తలు

ఫోన్‌ట్యాపింగా..అలాంటిదేం లేదే!

కుమారకు మద్దతిచ్చిన శివకుమార్‌, ఎంబీ పాటిల్‌

బెంగళూరు: కొత్త ప్రభుత్వం ఏర్పడిన కర్ణాటకలో ప్రస్తుతం ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కుదిపేస్తోంది. అధికారాన్ని చేజార్చుకున్న షాక్‌ నుంచి ఇంకా తేరుకోకముందే కుమార స్వామికి ఈ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి..కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య, ఆయన అనుచరగణంతో పాటు మరి కొందరు పోలీసు అధికారుల ఫోన్లను కుమారస్వామి ట్యాపింగ్‌ చేయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం ఒక్కసారిగా బయటకు రావడంతో రాష్ట్రంలో నేతలందరూ ఒక్కసారి భుజాలు తడుముకున్నారు. తమ హయాంలో అలాంటి ఘటనే జరగలేదని మాజీ మంత్రులు శివకుమార్‌, ఎంబీ పాటిల్‌ కొట్టి పారేశారు. కానీ విచారణను మాత్రం అడ్డుకోమని స్పష్టం చేశారు.

 ఈ వ్యవహారంపై ఎంబీ పాటిల్‌ మాట్లాడుతూ..‘నేను హోం మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలేవీ నా దృష్టికి రాలేదు. తమ ఫోన్లను ట్యాప్‌ చేశారని ఎవరూ నాకు ఫిర్యాదు చేయలేదు. ఏ ఒక్క అధికారీ ఈ విషయం నాతో పంచుకోలేదు. కానీ ఈ అంశంలో విచారణను నేను అడ్డుకోదలుచుకోలేదు. కానీ ఈ విషయంలో విచారణ కఠినంగా జరగాలని నేను సీఎం యడియూరప్పకు లేఖ రాస్తాను. నిజాయతీ గల అధికారులను నియమించి మూడు నెలల్లో ఈ వ్యవహారాన్ని తేల్చేయాలని కోరతాను.’ అని అన్నారు.  మరో మంత్రి శివకుమార్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలేవీ చోటు చేసుకోలేదన్నారు.

మరోవైపు కుమారస్వామి కూడా ఈ విషయంలో ధీమాగా ఉన్నారు. ఆయన అభిప్రాయానికి ప్రాధాన్యమిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొన్నందుకు ధన్యవాదాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘సీబీఐనే కాదు ట్రంప్‌తో కూడా విచారణ చేయించినా నాకేమీ అభ్యంతరం లేదు’’ అంటూ మండిపడ్డారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.