Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144549
            [news_title_telugu_html] => 

ఎయిరిండియా కేసులో చిదంబరంకు సమన్లు

[news_title_telugu] => ఎయిరిండియా కేసులో చిదంబరంకు సమన్లు [news_title_english] => ED summons P Chidambaram in aviation scam PMLA case [news_short_description] => యూపీఏ హయాంలో ఎయిరిండియాకు నష్టం వాటిల్లేందుకు కారణమైన భారీ కుంభకోణం, నగదు అక్రమ చలామణీ కేసులో కేసులో ఆర్థికశాఖ మాజీ మంత్రి పి. చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది [news_tags_keywords] => Chidambaram,AirIndia,PMLA case,ED [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 16:34:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎయిరిండియా కేసులో చిదంబరంకు సమన్లు - ED summons P Chidambaram in aviation scam PMLA case - EENADU
close

తాజా వార్తలు

ఎయిరిండియా కేసులో చిదంబరంకు సమన్లు

దిల్లీ: యూపీఏ హయాంలో ఎయిరిండియాకు నష్టం వాటిల్లేందుకు కారణమైన భారీ కుంభకోణం, నగదు అక్రమ చలామణీ కేసులో కేసులో ఆర్థికశాఖ మాజీ మంత్రి పి. చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం ఆగస్టు 23న అధికారుల ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 

2008-09 మధ్య కాలంలో విదేశీ ప్రయివేటు విమాన సంస్థలైన ఎమిరేట్స్‌, ఎయిర్‌అరేబియా, ఖతార్‌లకు ఎయిర్‌ స్లాట్స్‌ కేటాయించడంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఈ కుంభకోణం కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీగా నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

కుంభకోణం సమయంలో ప్రఫుల్‌ పటేల్‌ విమానయానశాఖ మంత్రిగా ఉండగా.. చిదంబరం ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రఫుల్‌ పటేల్‌ను ఈడీ ప్రశ్నించింది. తాజాగా చిదంబరంకు కూడా సమన్లు జారీ చేశారు. మరోవైపు ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసుల్లోనూ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.