Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145010
            [news_title_telugu_html] => 

కమల్‌నాథ్‌ మేనల్లుడి అరెస్టు

[news_title_telugu] => కమల్‌నాథ్‌ మేనల్లుడి అరెస్టు [news_title_english] => Madhya Pradesh Chief Ministers Nephew Arrested In 354Crore Bank Fraud [news_short_description] => మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పూరీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. రతుల్ పూరీ, మరో నలుగురు కలిసి ‘మోసెర్‌ [news_tags_keywords] => Madhya Pradesh,kamal nath,rathul puri [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => lQeoIY2d8ys [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 00:16:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కమల్‌నాథ్‌ మేనల్లుడి అరెస్టు - Madhya Pradesh Chief Ministers Nephew Arrested In 354Crore Bank Fraud - EENADU
close

తాజా వార్తలు

కమల్‌నాథ్‌ మేనల్లుడి అరెస్టు

దిల్లీ: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పూరీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. రతుల్ పూరీ, మరో నలుగురు కలిసి ‘మోసెర్‌ బేర్‌’ అనే సంస్థ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రూ.354 కోట్ల రుణాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేసినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా సీబీఐకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రతుల్‌ పూరీ, డైరెక్టర్లు నీతా పూరీ, సంజయ్‌ జైన్‌, వినీత్‌ శర్మపై అభియోగాలు దాఖలు చేశారు.  

బ్యాంకులను మోసం చేసిన కేసుతో పాటు రతుల్‌ పూరీ వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యూపీయే ప్రభుత్వ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాఫ్టర్ల కుంభకోణంలో కూడా లంచాలు తీసుకున్నట్లు రతుల్‌పై అభియోగం దాఖలైంది. అయితే వీటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొస్తున్నారు. అగస్టా కేసులో రతుల్‌కు సోమవారం సమన్లు అందజేసిన సీబీఐ, ఒకరోజు తిరగకుండానే మంగళవారం బ్యాంకులను మోసగించిన కేసులో ఆయన్ను ఆరెస్టు చేసింది.

 

 

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.