Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145527
            [news_title_telugu_html] => 

మరోసారి చిదంబరం ఇంటికి సీబీఐ బృందం

[news_title_telugu] => మరోసారి చిదంబరం ఇంటికి సీబీఐ బృందం [news_title_english] => CBI Knocks at Chidambarams Door Again [news_short_description] => కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ వెంటాడుతోంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు...... [news_tags_keywords] => Chidambaram, INX Media Case [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => UWi4wqH4Qqo [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 10:01:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మరోసారి చిదంబరం ఇంటికి సీబీఐ బృందం - CBI Knocks at Chidambarams Door Again - EENADU
close

తాజా వార్తలు

మరోసారి చిదంబరం ఇంటికి సీబీఐ బృందం

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ వెంటాడుతోంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. సుప్రీంలోనూ ఆయనకు ఊరట లభించలేదు.  మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు సీబీఐ అధికారులు దిల్లీలో ఆయన నివాసానికి చేరుకున్నారు. చిదంబరం అక్కడ లేరని తెలుసుకొని వారు వెనుతిరిగారు. ఆయన ఫోన్లను స్విచ్చాఫ్‌ చేసినట్లు కొందరు అధికారులు తెలిపారు. సీబీఐతోపాటు ఈడీ కూడా ఆయన కోసం గాలిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ మరోసారి బుధవారం ఉదయాన్నే చిదంబరం ఇంటికి వెళ్లారు. దక్షిణ దిల్లీలోని జోర్‌బాఘ్‌ వద్ద ఉన్న చిదంబరం నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. తీర్పు వెలువడినప్పటి నుంచి సీబీఐ బృందం ఆయన ఇంటికి రావడం ఇది మూడోసారి. మరోవైపు ఆయన ఏ సమయంలోనైనా రావచ్చని భావించిన ఈడీ బృందం చిదంబరం నివాసం వద్దే కాచుకొని ఉన్నారు. కానీ, ఆయన రాకపోవడంతో వెళ్లిపోయారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.