Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145552
            [news_title_telugu_html] => 

యోగి సర్కారులో రాజీనామాల రగడ

[news_title_telugu] => యోగి సర్కారులో రాజీనామాల రగడ [news_title_english] => Resignations precede Yogi Adityanath cabinet expansion today [news_short_description] => ఉత్తర్ ప్రదేశ్‌లో సీనియర్‌ మంత్రులు రాజీనామాల రగడ మొదలైంది. వాటితో పాటు నిరసనలు కూడా వెల్లువెత్తుతూనే ఉన్నాయి.... [news_tags_keywords] => Yogi Adityanath,BJP,ministry expansion [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 12:00:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
యోగి సర్కారులో రాజీనామాల రగడ - Resignations precede Yogi Adityanath cabinet expansion today - EENADU
close

తాజా వార్తలు

యోగి సర్కారులో రాజీనామాల రగడ

మంత్రివర్గ విస్తరణ ఈ రోజే

లఖ్‌నవూ: ఉత్తర్ ప్రదేశ్‌లో సీనియర్‌ మంత్రుల రాజీనామాల రగడ మొదలైంది. వాటితో పాటు నిరసనలు కూడా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 29నెలల యోగి ప్రభుత్వంలో ఎట్టకేలకు నేడు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. భాజపా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం 24 మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. అయితే భాజపాలో ఉన్న వయసు నిబంధన కారణంగా 75 ఏళ్లు నిండిన వారు పదవుల్లో ఉండకూడదు. ఈ నేపథ్యంలో మంత్రులుగా ఉన్న ఆరుగురు సీనియర్లు మంగళవారం రాజీనామాలు సమర్పించినట్లు తెలుస్తోంది. వారిలో ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేశ్‌ అగర్వాల్‌(74), ప్రాథమిక విద్యాశాఖ మంత్రి అనుపమ జైస్వాల్‌ల రాజీనామాలను ఆమోదించారు.

వచ్చే నెలలో తన 75వ పుట్టిన రోజు జరుపుకోనుండటంతో ఆమె రాజీనామా చేసినట్లు అగర్వాల్‌ తెలిపారు. అయితే రాజీనామా చర్యను అగర్వాల్‌ అనుచరులు ఖండిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప 75ఏళ్లు దాటినప్పటికీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని, ఇక్కడ మాత్రం ఆ నియమాన్ని పాటించాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. మైనింగ్‌ శాఖ మంత్రి అర్చనా పాండే, క్రీడాశాఖ మంత్రి చేతన్‌ చౌహన్‌, కోపరేటివ్‌ శాఖ మంత్రి ముకుత్‌ బిహారీ వర్మ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. అయితే, వీరి రాజీనామాలకు వయసు నిబంధనే కారణమా లేదా మరేమయినా ఉందా అనేది తెలియరాలేదు. అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగా లేకపోవడం వంటి కారణాలు కూడా ఉండచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే 24 మంది కొత్త వారికి మంత్రి వర్గంలో చోటు కల్పించనుండటంతో ఆశావహుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో భాజపాతో జట్టు కట్టిన పార్టీలకు కూడా ఈ మంత్రి వర్గవిస్తరణలో చోటు లభించనుంది. ఈ మంత్రి వర్గ విస్తరణ మాత్రం ముఖ్యమంత్రి యోగికి కత్తిమీద సామేనని భాజపా సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.