Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145564
            [news_title_telugu_html] => 

రైల్వే ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగులు

[news_title_telugu] => రైల్వే ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగులు [news_title_english] => IRCTC to take over test runs for privatisation soon [news_short_description] => రైల్వేలో ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగులు పడుతున్నాయి. ప్రైవేట్‌ ఆపరేటర్లతో రైళ్లు నడిపేందుకు రంగం సిద్ధమైంది. ప్రయోగాత్మకంగా దిల్లీ-లఖ్‌నవూ, అహ్మదాబాద్‌-ముంబయి మధ్య సెంట్రల్‌ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపే బాధ్యతను........ [news_tags_keywords] => Indian Railways,Tejas Express,IRCTC [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 13:20:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రైల్వే ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగులు - IRCTC to take over test runs for privatisation soon - EENADU
close

తాజా వార్తలు

రైల్వే ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగులు

దిల్లీ: రైల్వేలో ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగులు పడుతున్నాయి. ప్రైవేట్‌ ఆపరేటర్లతో రైళ్లు నడిపేందుకు రంగం సిద్ధమైంది. ప్రయోగాత్మకంగా దిల్లీ-లఖ్‌నవూ, అహ్మదాబాద్‌-ముంబయి మధ్య సెంట్రల్‌ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపే బాధ్యతను తమ అనుబంధ విభాగమైన ఐఆర్‌సీటీసీకి అప్పగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్ల టికెట్ల ధరల్ని నిర్ణయించే బాధ్యతని కూడా ఆ సంస్థకే రైల్వే బోర్డు కట్టబెట్టింది. ప్రైవేటు ఆపరేటర్లతో రైళ్లు నడిపే దిశగా ఇది ఒక ప్రయోగమని అధికార వర్గాలు తెలిపాయి. రెండు రైళ్లను మూడేళ్ల కాలానికి ఐఆర్‌సీటీసీకి అప్పగిస్తున్నట్లు రైల్వే బోర్డు రూపొందించిన వివరణాత్మక పత్రంలో పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ రైళ్లలో ఎలాంటి రాయితీలు, పాస్‌లు చెల్లబోవని స్పష్టం చేసింది. ఈ రెండు తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో టికెట్ల తనిఖీని రైల్వే సిబ్బంది చేపట్టబోరని రైల్వే బోర్డు వెల్లడించింది. రైళ్లను మాత్రం తమ సిబ్బందే నడుపుతారని తెలిపింది. లోకోపైలెట్లు, గార్డులు, స్టేషన్‌ మాస్టర్లు అంతా రైల్వే సిబ్బందే ఉంటారని పేర్కొంది. శతాబ్ది రైళ్ల మాదిరిగానే వీటి సేవలుంటాయని బోర్డు వివరించింది. ఈ రెండు రైళ్లలో లోపల, వెలుపల ప్రకటనలు ఇచ్చేందుకు ఐఆర్‌సీటీసీకి అధికారం ఉంటుంది. భద్రతలో రాజీపడకుండా బోగీల్లో మార్పులు చేర్పులు కూడా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఒకవేళ ఈ రైళ్లలో ప్రమాదాలు గనక జరిగితే పరిహారం, చికిత్స విషయంలో ప్రస్తుత నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.