Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145583
            [news_title_telugu_html] => 

‘చిదంబరం ప్రతిష్ఠను దిగజార్చేందుకే అలా..’

[news_title_telugu] => ‘చిదంబరం ప్రతిష్ఠను దిగజార్చేందుకే అలా..’ [news_title_english] => Rahul Gandhi criticised Modi govt on Chidambaram Issue [news_short_description] => కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రతిష్ఠను దిగజార్చేందుకే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాహుల్‌ గాంధీ ... [news_tags_keywords] => Rahul Gandhi,Congress,Chidambaram,INX media case,Politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 14:15:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘చిదంబరం ప్రతిష్ఠను దిగజార్చేందుకే అలా..’ - Rahul Gandhi criticised Modi govt on Chidambaram Issue - EENADU
close

తాజా వార్తలు

‘చిదంబరం ప్రతిష్ఠను దిగజార్చేందుకే అలా..’

కేంద్రంపై ట్విటర్‌లో రాహుల్‌ విమర్శలు

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రతిష్ఠను దిగజార్చేందుకే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. సీబీఐ, ఈడీ, కొన్ని మీడియా సంస్థలను మోదీ సర్కార్‌ వాడుకుంటోందని మండిపడ్డారు.ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం వ్యవహారంపై రాహుల్‌ ట్విటర్‌లో స్పందించారు. అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతూ మోదీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో అభియోగాల నేపథ్యంలో చిదంబరం దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను నిన్న దిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వెంటనే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. అక్కడా ఉపశమనం లభించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌ ధర్మాసనానికి పంపినట్టు జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. మరోవైపు, చిదంబరం ఆచూకీ ఇంతవరకూ తెలియకపోవడంతో సీబీఐ అధికారులకు ఆయనకు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.