Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145589
            [news_title_telugu_html] => 

కశ్మీర్‌పై పాక్‌కి ఫ్రాన్స్‌ సూచనలివే!

[news_title_telugu] => కశ్మీర్‌పై పాక్‌కి ఫ్రాన్స్‌ సూచనలివే! [news_title_english] => French Minister In Call With Pak discussed Over Kashmir Issue [news_short_description] => కశ్మీర్‌పై పాక్‌ చేస్తున్న మొండి వాదనల నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌ మాటల్ని అదుపులో పెట్టుకోమని దాయాది దేశం పాక్‌ హతబోధ చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం సైతం పాక్‌కు పలు సూచనలు చేసింది............. [news_tags_keywords] => France,Pakistan,Shah Mahmood Qureshi,Kashmir [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 14:09:48 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కశ్మీర్‌పై పాక్‌కి ఫ్రాన్స్‌ సూచనలివే! - French Minister In Call With Pak discussed Over Kashmir Issue - EENADU
close

తాజా వార్తలు

కశ్మీర్‌పై పాక్‌కి ఫ్రాన్స్‌ సూచనలివే!

దిల్లీ: కశ్మీర్‌పై చేస్తున్న మొండి వాదనల నేపథ్యంలో దాయాది దేశం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాటల్ని అదుపులో పెట్టుకోమని అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌ హితబోధ చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం సైతం పాక్‌కు పలు సూచనలు చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సంయమనం పాటించాలని, ఉద్రిక్త పరిస్థితుల్ని రెచ్చగొట్టే చర్యలు చేపట్టవద్దని సూచింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి జీన్‌ డ్రియాన్‌ పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీతో మాట్లాడారు. అలాగే కశ్మీర్‌ అంశం పూర్తిగా ద్వైపాక్షిక అంశమని, చర్చల ద్వారా దానిపై ఓ పరిష్కారానికి రావాలని సూచించారు. పరోక్షంగా పాకిస్థాన్‌కు తమ మద్దతు ఉండదని చెప్పకనే చెప్పారు. 

అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు విఫలయత్నాలు చేస్తున్న పాక్‌కి ఫ్రాన్స్‌ వైఖరి మింగుడు పడని విషయమనే చెప్పాలి. ఐరాస భద్రతా మండలిలో ఫ్రాన్స్‌ శాశ్వత సభ్య దేశం కావడం గమనించాల్సిన విషయం. భారత్‌, పాక్‌ ప్రధాన మంత్రులతో ట్రంప్‌ మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఫ్రాన్స్‌ నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు బంగ్లాదేశ్‌ సైతం కశ్మీర్‌పై భారత్‌ నిర్ణయం పూర్తిగా అంతర్గత విషయమని తేల్చి చెప్పింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.